జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, పంచారామాలు, పంచభూత లింగక్షేత్రాలు

 


ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది:
  1. రామనాథస్వామి లింగము - రామేశ్వరము
  2. మల్లికార్జున లింగము - శ్రీశైలము
  3. భీమశంకర లింగము - భీమా శంకరం
  4. ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం
  5. త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం
  6. సోమనాథ లింగము - సోమనాథ్
  7. నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక)
  8. ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం
  9. మహాకాళ లింగం - ఉజ్జయని
  10. వైధ్యనాథ లింగం - చితా భూమి (దేవఘర్)
  11. విశ్వేశ్వర లింగం - వారణాశి
  12. కేదారేశ్వర - కేదారనాథ్


అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


పంచారామాలు:
  1. అమరావతి: ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి ' గా వెలిసెను.
  2. భీమవరం: ఇక్కడ చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను.
  3. పాలకొల్లు: ఇక్కడ శ్రీ రామచంద్రమూర్థి ప్రతిష్టించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను.
  4. సామర్లకోట: ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.
  5. ద్రాక్షారామo: చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడినది. స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు

పంచభూత లింగక్షేత్రములు:
  1. అన్నామలైశ్వరుడు - అన్నామలై: అగ్ని లింగం
  2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం: జల లింగం
  3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం: ఆకాశ లింగం
  4. ఏకాంబరేశ్వరుడు - కంచి: పృధ్వీ లింగం
  5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి: వాయు లింగం

త్రిలింగ దేశం:
మన రాష్ట్రానికి త్రిలింగ దేశమని పేరు రావడానికి కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము.




ref:


జ్యోతిర్లింగాలు - http://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A6%E0%B0%B6_%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81


శక్తిపీఠాలు - http://te.wikipedia.org/wiki/%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B1%80%E0%B0%A0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81


పంచారామాలు  - http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81


దేవాలయాలు - http://bhaktisudha.com/index.php?option=com_content&view=category&id=28&Itemid=75 


ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు - http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82:%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D_%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 



నరసింహావతారము - http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%82%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%82 



Temples of Andhra Pradesh - http://www.templenet.com/andhra.html

Popular Posts