దామెర్ల రామారావు చిత్ర రాజాలు(Damerla RamaRao Paintings)
భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో దామెర్ల రామారావు ఒకరు. ఆరేళ్ళ వయసునుండి గోడమీద బొగ్గుతో బొమ్మలు, ఆపైన తెల్ల కాగితాల మీద వేయటం ప్రారంభించాడు. మేనమామ ప్రోత్సాహంతో పదేళ్ళవయసుకి చక్కని ప్రకృతి రమణీయ దృశ్యాలు గీయటం, అవి అందరి అభినందనలు అందుకోవటం మొదలయింది. కొబ్బరితోటల్లో కూర్చుని, గోదావరిగట్టు మీద కూర్చుని, లాంచీలో తిరుగుతూ ఒకటేమిటి? అనేక ప్రకృతి దృశ్యాలను చిత్రించాడు.
చిత్రకళా ప్రతిభ:
సీమంతం - 1923 వ సంవత్సరంలో దామెర్ల రామారావు చిత్రించిన అసాధారణ అత్యద్భుత చిత్రమే ఈ ' పుష్పాలంకరణ" ( పువ్వుల ముడుపు) . ఇది ఆంధ్రప్రదేశములో తమ ఇంటి ఆడపడుచులకు తొలికానుపు ముందు చేయు సంబరం. ముతైదువుల సమక్షమున జరుపు ముచ్చటైన వేడుకను ఆయన బార్యకు జరిగిన సీమంతమును చూసి పరవశించి ఆ సంఘటనకు శాశ్వత స్వరూపమును తన రచనా పాటవముతో చిత్రించాడు. రూపు రేఖా విలాసాలను, ఆనాటి స్త్రీలకు తగిన వస్త్రధారణా విధానమును, పేరంటాలకు జరుగు పన్నీటి జల్లులు , అమ్మలక్కల కాలక్షేపపు ముచ్చట్లు , కూర్చునే వివిధ పద్ధతులు ఇటువంటి ఎన్నో విశేషాలు ఈ చిత్రము ద్వారా మనకు గోచరిస్తాయి.ఇదే ఆయన చిత్రీకరణలోని ప్రత్యేకత.
బావివద్ద - ఆంధ్ర గ్రామీణ వాతావరణ చిత్రీకరణ ఈ చిత్రములో కలదు. గ్రామాలలో గల ఊరుమ్మిడి మంచి నీటి గిలక బావుల వద్ద ఓ ఉదయపు దృశ్యాన్ని ఆయన కుంచెద్వారా మనకు అద్దము పట్టినట్లు చూపించాడు. బావులవద్ద ఆనాటి స్త్రీలు చేదతో నీటిని తోడే వయ్యారాలు, నీటి బిందెలు ఎత్తుకొని నడచి వెళ్ళెడి స్త్రీల సౌందర్యం, చేదకోసం వేచి నిలబడియున్న స్త్రీల లావణ్యం, బిందెలను నెత్తిన ఎత్తుకొని వెళ్ళెడి స్త్రీల నడవడిక , నిలుచునే విధానము, బిందెలు భూజాన పెట్టుకున్న స్త్రీల సహజత్వం, వివిధ వ్యక్తుల వివిధ బంగిమల కూర్పు, ఆనాటి స్త్రీల వస్త్రధారణా విధానమున చూపిన సహజత్వం, ఆ నూతి వెనుక (బావి) ప్రకృతి యొక్క దివ్యత్వం చూసిన కన్నులకు రసానందము కల్గించు అద్వితీయ కళా సృష్టి ఈ చిత్రము. విశ్వవిఖ్యాత చిత్రకారులతో సరితూగగల ప్రతిభ , నైపుణ్యం దామెర్ల దని నిరూపించెడి చిత్రమిది.
ref:

.jpg)














