తెలుగు సినిమా పాటలు

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లిప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లిప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లిసేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట మమతల మూట
అమ్మంటే అంతులేని సొమ్మురా
అది యేనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట మమతల మూట
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
అందరకీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
అందరకీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ
అమ్మ అనురాగం ఇక నుంచీ నీదీ నాదీ
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట మమతల మూట
2.
శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

తలమీద చెయ్యివేసి వొట్టు పెట్టినా
తాళిబొట్టు మెడనుకట్టి బొట్టు పెట్టినా
సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం

అడుగడుగున తొలిపలుకులు గుర్తుచేసుకో
తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో
ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని
మసకేయని పున్నమిలా మనికి నింపుకో

శ్రీరస్తు శుభమస్తు
శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం
ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

3.

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ
ముద్దు మురిపాలలొలొకు ముంగిళ్ళలోన మూడుపువ్వులు ఆరుకాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ ఆ ఆ ఆ అ అ అ

చరణం1:

ఆరనైదోతనము ఏ చోటనుండు అరుగులలికేవారి అరచేతనుండు
ఆరనైదోతనము ఏ చోటనుండు అరుగులలికేవారి అరచేతనుండు
తీరయిన సంపద ఎవరింటనుండు
తీరయిన సంపద ఎవరింటనుండు
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ ఆ ఆ ఆ అ అ అ

చరణం2:

కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరికొలిచేవారి కొంగుబంగారు
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరికొలిచేవారి కొంగుబంగారు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
గోవుమాలక్ష్మికి కోటి దండాలు
కోరినంతపాడి నిండు కడవళ్ళు ఆ ఆ ఆ అ అ

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ ఆ ఆ ఆ అ అ అ

చరణం3:

మగడు మెచ్చినచాన కాపురంలోన మొగలిపూలాగాలి ముత్యాల వాన
మగడు మెచ్చినచాన కాపురంలోన మొగలిపూలాగాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంతవైభోగం

ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ
ముద్దు మురిపాలలొలొకు ముంగిళ్ళలోన మూడుపువ్వులు ఆరుకాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తయిదు కుంకుమ బ్రతుకంత ఛాయ ఆ ఆ ఆ అ అ అ


4.
ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు .....
ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం
ముడుచుకొనే కొలది మరీ మిడిసిపడే సింగారం
సోయగాల విందులకై వేయి కనులు కావాలీ .....

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు

నింగిలోని వేలుపులు ఎంత కనికరించారో
నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమినొసగేరు
పులకరించు మమతలతో పూల పాన్పు వేసారు

హ్మ్మ్మ్ మ్మ్మ్ మ్మ్

ఏదో ఏదో అన్నది ఈ మసక మసక వెలుతురు
గూటి పడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు
5.
అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మ వినాశాపు అరాచకాన్ని స్వరాజ్యమందామా
దానికి సలాము చేద్దామా

శాంతి కపోతపు కుత్తుక తెంచి ఇచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం

నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా
ఓ పవిత్ర భారతమా

అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా
స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా
దాన్నే స్వరాజ్యమందామా

కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడ లేని తెగువుని చూపి తగువుకి లేస్తారే
జనాలు తలలర్పిస్తారే

సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం
తెలిసీ భుజం కలిపి రారేం

అలాటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి
పోరి ఏమిటి సాధించాలి

ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా!
ఓ అనాథ భారతమా!! .....................అర్థ...

అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా?
వెలుగుని తప్పుకు తిరగాలా?

శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా?
అన్నల చేతిలో చావాలా?

తనలో ధైర్యం అడవికి ఇచ్చి తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సిందూరం
వేకువ వైపా చీకటిలోకా ఎటు నడిపేనమ్మా
గతి తోచని భారతమా.................అర్థ...

తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకుని
తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తూందట ఆవేశం
ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం
చితి మంటల సింధూరం
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా
ఓ విషాద భారతమా ......................అర్థ

6.
నవమి నాటి వెన్నెల నేను
దసమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ కార్తీక పున్నమి రేయి

నీ వయసే వసంత ౠతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత ౠతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో మరచిన మన తొలి కలయికలో నవమి నాటి

నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతి గా
అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో నవమి నాటి

7.
ఆకాశం ఏనాటిదో
అనురాగం ఆనాటిది
ఆవేశం ఏనాడు కలిగెనొ
ఆనాడే తెలిసిందది ఆకాశం ఏనాటిదో

ఏ పువ్వు ఏ తేటిదన్నది
ఏ నాడో రాసున్నది
ఏ ముద్దు ఏ మోవిదన్నది
ఏ పొద్దో రాసున్నది
బంధాలై పెనవేయు వయసుకు
ఆందాలే దాసోహమనగ
మందారం విరబూయు పెదవులు
మధువులనే చవి చూడమనగ
పరువాలే ప్రణయాలై
స్వప్నాలే స్వర్గాలై
ఎన్నేన్నో శృంగార లీలలు
కన్నుల్లో రంగేళి అలరెను ఆకాశం ఏనాటిదో

ఏ మేఘం ఏ వాన చినుకై
చిగురాకై మొలకెత్తునో
ఏ రాగం ఏ గుండె లోతున
ఏ గీతం పలికించునో
హృదయాలే తెర తీసి తనువుల
కలబోసి మరపించమనగ
కౌగిలిలో చెర వేసి మదనుని
కరిగించి గెలిపించ మనగ
మోహాలే దాహాలై
సరసాలే సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు
ఇవ్వాలి వెలలేని విలువలు ఆకాశం ఏనాటిదో

8.
బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లో పోతావ్‌ కొడకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవురో
నైజాము సర్కారోడా

పోలీసు మిల్టీ రెండు
బలవంతులా అనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కారోడా

స్త్రీపురుషులంతా కలిసీ
పిల్లలమంతా కలిసీ
వడిశెల్ల రాళ్ళు నింపీ
వడివడికొట్టితేను
కారాపు నీళ్ళు తెచ్చీ
కళ్ళల్లో చల్లితేను
నీ మిల్టి పారిపోయెరో..
నీ మిల్టి పారిపోయెరో..
నైజాము సర్కారోడా

మా పొలం మింగినోడా
మా అడవి దోచినోడా
మా బతుకు బుగ్గు చేసి
సిరిసంపదంతా దోచీ
సంచుల్లకెత్తుకోనీ
బండ్లల్ల నింపుకోని
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
నైజాము సర్కరోడా

చుట్టుముట్టు సూర్యపేట
నట్ట నడమ నల్లగొండ
నువ్వెళ్ళేది హైద్రాబాదు
దానిపక్కన గోలకొండ
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
నీ ఘోరీ కడతాం కొడకో
నైజాము సర్కారోడా

9.
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల,
నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను
కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను
పెద్దబాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినవి.

చేతి వృత్తుల చేతులిరిగిపాయె, నా పల్లెలోన
అయ్యొ గ్రామ స్వరజ్యం గంగలోనబాయె, ఈ దేశంలోన

మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరైనవి
వాగులు వంకలు ఎండిపోయినవి
చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోనా

ఈదులన్ని వట్టి మొద్దులయ్యినవి
ఈత కల్లు బంగారమయ్యినది
మందుకలిపిన కల్లును తాగిన మంది కండ్లు నిండుసులయ్యినవి

చల్లని బీరు విస్కిలెవడు పంపె నాపల్లెల్లోకి
బుస్సున పొంగె పెప్సికోల వచ్చె నాపల్లెల్లోకి

పరకచేపలకు గాలం వేసే తురకల పోరలు యాడికి పోయిరి
లారీలల్ల క్లీనర్లయ్యిరా, పెట్రోల్ మురికిల మురికయ్యిండ్రా
ఆ సాయిబు పోరలకు ఆ బేకరి కేఫ్ లలో ఆకలితీరిందా?

అరకల పనికి ఆకలిదీరక గాసమెల్లక
ఫర్నీచరు పనులెదుక్కుంటూ పట్నంపోయర విశ్వ కర్మలూ
ఆసామూలంతా కూసూనేటి, ఆ వడ్రంగుల వాకిలి
నేడు పొక్కిలి లేసి దు:ఖిస్తున్నదిరో నా పల్లెల్లోనా

కుట్టుడు రెక్కల బనీన్లుపోయినవి, సోడె లాగులు జాడకు లేవు
రెడిమెడు ఫాషను దుస్తులొచ్చెనంటా నాపల్లె పొలిమెరకు
ఆకుట్టుమిషన్ల చప్పుడాగినాదా నాపల్లెల్లోనా.

కంసలి వీధులు వన్నె తగ్గినవి చిన్నబోయినవి
చెన్నై బాంబె కంపని నగలొచ్చి మనస్వర్ణ కారుల,
అరె చెర్నకోలలై తరుముతున్నయీరా మనపల్లెల నుంచీ

మాదిగ లొద్ది నోరు తెరచినది, తంగెడు చెక్క భంగపడ్డది
తొండం బొక్కెన నిండమునిగినది, ఆరె రంప పదునారిపోయినది
పాత రేకు వలె మోతలు మోగేటి ప్లాస్టిక్కు డప్పులు
నా మేదరి డప్పును పాతరేసె కదరా? నాపల్లెల్లోనా.

పూసలోల్ల తాలాము కప్పలు,
కాశిలో కలసి ఖతమౌతున్నవి.

ఇల్లు కట్టుకొనె ఇటుకల రాయితో, సెలకల చల్లె ఎరువు కుళ్లుతో
ఎద్దు బండి ఉన్నోనికి సేతిలో ఏడాదంతా పని దొరికేది
టాటా ట్రాక్టరు టక్కరిచ్చినాదో, నా డొంక దారిని
నా ఎద్దు బండిగిల్లెగిరి పడ్డదో నా పల్లెల్లోనా.

వానపాములు నత్త గుల్లలు భూమిలో ఎందుకు బతుకతలేవూ…
పంటపొలాల మందుల గత్తర వాసన

హరిశ్చంద్ర పద్య నాటకాల పంతులార్మోనియం చెదలు పట్టినది
యక్షగానము నేర్పేపంతులు ఉప్పరి పనిలో తట్టపట్టినడు.
యాచకులు, నా బుడగా జంగాలూ, ఈ పల్లెల నిలచి
ఆ పాతబట్టల మూటలమ్ముతుండ్రా తమపొట్టకూటికై…
…బతుకమ్మా, కోలాటపాటలు, భజన కీర్తనలు బైరాగుల
కిన్నెర తత్వమ్ములు, కనుమరుగాయెర నాపల్లెల్లో

వృత్తులు కూలె ఉపాధి పోయె, ప్రత్యామ్నాయం లేకను పోయె
కూలిన బ్రతుకులు నిలుపుటకైనా కుటీర పరిశ్రమలైనా పెట్టరు.
బహుళ జాతి కంపని మాయల్లోనా నా అన్నల్లారా
భారత పల్లెలు నలిగి పోయి కుమిలె నా అయ్యల్లారా.

10.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడమనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగిమేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి జాబిల్లి కోసం

నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనదినీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
ఉండి లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నీవే దూరాన ఉన్నా
నా తోడు నీవే నీ దగ్గరున్నా నీ నీడ నాదే నాదన్నదంతా నీవే నీవే జాబిల్లి కోసం

11.

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా
కలికి మా చిలకా పాడకు నిన్నటి నీ రాగం
రాలిపోయే పువ్వా

చెదిరింది నీ గూడు గాలిగా
చిలకా గోరింకమ్మ గాథగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తన వాడు తారల్లో చేరగా
మనసూ మాంగల్యాలు జారగా
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై…వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై…ఆశలకే హారతివై
రాలిపోయే పువ్వా
అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే హేమంత రాగాల చేమంతులే వాడిపోయే తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే దీపాల పండక్కి దీపాలే కొండెక్కి పోయే పగిలే ఆకాశము నీవై…జాలిపడే జాబిలివై మిగిలే ఆలాపన నీవై…తీగ తెగే వేణియవై రాలిపోయే పువ్వా
12.
రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ రేపల్లియ యద ఝల్లున
కాళింది మడుగున
కాళీయుని పడగనా
ఆబాలగోపాల
మా బాలగోపాలుని కాళింది మడుగున
అచ్చెరువున అచ్చెరువున
విచ్చిన కన్నుల చూడ అచ్చెరువున
తాండవమాడిన సరళి
గుండెల మ్రోగిన మురళి
ఇదేనా…ఇదేనా
ఆ మురళీ
అనగల రాగమై
తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి
మరులే కురిపించి అనగల రాగమై
జీవన రాగమై బృందావన గీతమై
ఆ..ఆ
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళీ
ఆ..ఆ…ఆ
వేణుగాన లోలుని మురిపించిన రవళి
నటనల సరళీ
ఆ నందన మురళీ
ఇదేనా…ఆ మురళీ
మువ్వల మురళి
ఇదేనా…ఆ మురళీ
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
ఆ…ఆ..ఆ
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి
ఇదేనా
ఇదేనా…ఆ మురళీ
రేపల్లియ యద ఝల్లున
పొంగిన రవళి
నవరస మురళీ
అ నందన మురళీ
ఇదేనా ఆ మురళీ
మోహన మురళీ
13.
మౌనమేలనోయి
మౌనమేలనోయి…ఈ మరపు రాని రేయి
మౌనమేలనోయి…ఈ మరపు రాని రేయి
ఎదలో వెన్నెల…వెలిగే కన్నులా
ఎదలో వెన్నెల…వెలిగే కన్నులా
తారాడే హాయిలో
ఇక మౌనమేలనోయి ఈ మరపు రాని రేయి
పలికే పెదవి…వొణికింది ఎందుకో
వొణికే పెదవి…వెనకాల ఏమిటో
కలిసే మనసులా…విరిసే వయసులా
నీలి నీలి వూసులు…లేతగాలి బాసలు
ఏమేమో అడిగినా మౌనమేలనోయి
హిమమే కురిసే…చందమామ కౌగిట
సుమమే విరిసే…వెన్నెలమ్మ వాకిట
ఇవి ఏడడుగులా…వలపు మడుగులా
కన్నె ఈడు ఉలుకులు…కంటిపాప కబురులు
ఎంతెంతో తెలిసిన మౌనంమేలనోయి
14.
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా
పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా చెయ్యరా
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా
పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా చెయ్యరా
హమేషా తమాషా చెయ్యరా ॥ ఆకాశం ॥

నేలవిడిచి సాములెన్నో చెయ్యరా
మబ్బుల్లో మెఱుపంతా నీదిరా
నిలబడు తాగేనీరు చేదురా
పరుగెత్తనా పాలు తాగరా
బ్రతుకంటే బస్తీమే సవ్వాల్రా ప్రపంచమే మాయాబజారురా
ప్రపంచమే మాయాబజారురా
గురిచూసి కొట్టాలిరా సిరిచీసి పట్టాలిరా
నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులో జిత్తులు వెయ్యరా
ఎత్తులో జిత్తులు వెయ్యరా ॥ ఆకాశం ॥

నుదుటిరాత నువ్వు మార్చి రాయరా
నూరేళ్ళ అనుభవాలు నీవిరా
అనుకొన్నది పొందటమే నీతిరా
మనకున్నది పెంచటమే ఖ్యాతిరా
మనిషి జెన్మ మఱువలేని ఛాన్సురా
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
సుడిలోకిదూకాలిరా
కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే థడాకా మజాకా చూపరా
థడాకా మజాకా చూపరా ॥ ఆకాశం ॥
15.
ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి

నీ ప్రణయభవం నా జీవ రాగం
నీ ప్రణయభవం నా జీవ రాగం
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
అనురాగ రాగాల పరలోకమె మనదైనది

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
రసమయం జగతి



ref:
http://www.teluguvaibhavam.com/
-->

-->

Popular Posts