ఎంకి పాటలు

Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.

ఎంకి పాటలు నండూరి వెంకట సుబ్బారావు రచించిన గేయ సంపుటి. ఎంకిపాటలలో సుబ్బారావు గోదావరి మాండాలికాన్ని విశాఖ రూపకబేధాలతో కలిపి ఉపయోగించాడు.
తెలుగు ఆధునిక సాహిత్యంపై ఆంగ్ల సాహిత్యంలోని "కాల్పనిక భావ కవిత్వం" (రొమాంటిక్ పొయెట్రీ) ప్రేరణ వలన వెలువడిన రచనలలో "ఎంకి పాటలు" ఒక ప్రముఖ అధ్యాయం. ఈ భావ కవిత్వపు ఉద్యమంలో అప్పటి నవకవులు తమ సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయాన్నీ, పాశ్చాత్య భావ కవితల పోకడలనీ సమ్మిళితం చేసి ఎన్నో ప్రణయ గీతాలు పలికారు. ఆ సందర్భంలోనే ఊర్వశి, హృదయేశ్వరి, శశికళ, వత్సల, ఎంకి వంటి ప్రణయనాయికలు తెలుగు కవితాభిమానుల గుండెలలో స్థానం సంపాదించారు.
ఎంకి పాటలు ప్రధానంగా ప్రణయానికి సంబంధించిన పాటలు. తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు, వేదనలు, విరహాలు ఈ పాటల్లో చక్కని పదాలలో కూర్చబడ్డాయి.

ఎంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక. ధర్మబద్ధమైన హద్దులలోనే ప్రేమిస్తుంది.
"కన్ను గిలికిస్తాది, నన్ను బులిపిస్తాది, దగ్గరగ కూకుంటె అగ్గి సూస్తాది"

అందుకే
ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు, తల్లో పూవుల సేరు

కళ్ళెత్తితే సాలు రాసోరింటికైనా రంగు తెచ్చే పిల్ల.

పదమూ పాడిందంటె, కతలూ సెప్పిందంటె కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లె, అందాల బరిణల్లె, సుక్కల్లె నా యెంకి

అంటూ "ఎంకి" ని సృష్టించారు నండూరి వారు.
ఎంకి పాటలు
ఎంకి ముచ్చట్లు

యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు !
యేటి సెప్పేది నాయెంకి ముచ్చట్లు?
దొడ్డితోవ కళ్లె తొంగి సూడంగానే
తోటకాడే వుండు త్వరగొస్త నంటాది !!

యెన్నాని సెప్పేది. . . .
యెంకి రాలేదని యెటో సూత్తా వుంటె
యెనకాలగా వచ్చి 'యెవురునో?' రంటాదీ ?
యెన్నాని సెప్పేది. . . .

'సిట్టి సేబా'సాని నిట్టూర మేత్తుంటే
మాటాయినబడనటు మరి యేటో సెపుతాదీ
యెన్నాని సెప్పేది. . . .
కోడి గూసేసరికి కొంపకెల్లాలి, నీ
కోసరమె సెపుతాను కోపమొద్దంటాది!!
యెన్నాని సెప్పేది. . .

యెంత సేపున్నాను యిడిసి పెట్టాలేవు
తగువోళ్లలో మనకు తలవంపులంటాదీ!!
యెన్నాని సెప్పేది. . .

యెనకెనక సూత్తానె యెల్లుతా వుంటాది,
యెన్నాని సెప్పేది యెంకి ముచ్చట్లు!
యెన్నాని సెప్పేది నాయెంకి ముచ్చట్లు?


ముద్దుల నా యెంకి

గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ కూకుండనీదురా కూసింతసేపు
నాకేసి సూస్తాది! నవ్వు నవ్విస్తాది!! ఎల్లి మాట్లాడొస్తే ఇసిరి కొడతాది! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!
కన్నుగిలికిస్తాది! నన్ను బులిపిస్తాది!! దగ్గరస కూకుంటె అగ్గి సూస్తాది! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!
ఈడుండమంటాది! ఇలుదూరిపొతాది!! ఇసిగించి ఇసిగించి ఉసురొసుకొంటాది! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!
మందో మాకో యెట్టి మరిగించినాది! వల్లకుందామంటే పాణమాగదురా! గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ!!
గోవుమా లచ్చిమికి కోటి దండాలు

గోవుమా లచ్చిమికీ కోటి దండాలు
మనిషికైనా లేని మంచి పోకిళ్ళు

యెంకితో కూకుండి యింత సెబుతుంటే
తనతోటి మనిసల్లె తలతిప్పుతాడే
యెంకి సరసాలాడ జంకుతా వుంటే
సూసి సూడక కన్ను మూసి తెరిసేడే

వొనలచ్చిమి
జాము రాతిరియేళ జడుపు గిడుపూ మాని సెట్టు పుట్టాదాటి సేనులో నేనుంటే మెల్లంగ వస్తాది నాయెంకీ సల్లంగ వస్తాది నాయెంకీ
పచ్చని సేలోకి పండుయెన్నెల్లోన నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటే వొయ్యారమొలికించు నాయెంకీ వొనలచ్చి మనిపించు నాయెంకీ
యెంకివస్తాదాని ఎదురూగ నేబోయి గట్టు మీదా దాని కంట కాపడగానే కాలు కదపాలేదు నాయెంకీ కరిగినీరవుతాది నాయెంకీ
మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి గోనెపట్టాయేసి గొంగడి పైనేసి కులాస గుంటాది నాయెంకీ కులుకు సూపెడతాది నాయెంకీ
యేతా మెత్తేకాడ యెదురూగ కూకుండి
మల్లీ ఎప్పటల్లే తెల్లరబోతుంటే
సెందురున్నీ తిట్టు నాయెంకీ సూరియుణ్ణీ తిట్టు నాయెంకీ
మరొకటి
యెనక జన్మములోన యెవరిమోనంటీ
సిగ్గొచ్చి నవ్వింది సిలకనా యెంకి
ముందు మనకే జల్మముందోలె యంటి
తెలతెల్లబోయింది పిల్లనా యెంకి
యెన్నాళ్ళొ మనకోలె యీ సుకములంటి
కంట నీరెట్టింది జంట నా యెంకి
ref:
-->

Popular Posts