అద్భుత సాహిత్యం, అత్యద్భుత సంగీతం ... అహో తెలుగు సినిమా వరమో !
ఏ నావ దే తీరమో
ఈ నేస్తం మే జన్మ వారమో
కలగానో కధగానో
మిగిలేది నీవే ఈ జన్మలో // ఏ నావ దే తీరమో
నాలోని నీవే నేనైనానో
నీలోని నేనే నీవైనావో
ఇన్నావా ఈ వింతను
అన్నారా ఎవరైనను
నీకు నాకూ చెల్లిన్దనో // ఏ నావ దే తీరమో
ఆకాశమల్లె నీవున్నావు
నీ నీలిరంగై నేనున్నాను
కలిసేది ఊహేననో ఊహల్లొ కలిశామనో
నువ్వు నేనే సాక్షలనో // ఏ నావ దే తీరమో
కల గానో కధ గానో
మిగిలేది నీవే ఈ జన్మ లో // ఏ నావ దే తీరమో
------------------------------------------------------------
చిత్రం : సంకీర్తన
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
సంగీతం: ఇళయరాజా
గానం: ఏసుదాస్
------------------------------------------------------------
video song: https://www.youtube.com/watch?v=ILdYpASsacI



