Art of choosing ... ఎంపిక ఒక కళ !
ref: http://archives.eenadu.net/08-31-2014/Magzines/SundaySpecialInner.aspx?qry=weekpanel1
Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.
Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.
విజయం = గెలుపు ఓటమి మధ్య ఒక ఎంపిక
ఈ రోజు నీ ఎంపిక రేపు నీ భవిష్యత్ ని నిర్ణయిస్తుంది. జీవితం ఒక ఎంపికల మాలిక. విజయవంతమైన జీవితం లో ప్రతి మలుపు దగ్గరా ఒక సరైన ఎంపిక ఉండాలి.
ఎవరి జీవితం వారిది, ఎవరి లక్ష్యాలు వారివి అలాగే ఎవరి ఎంపికలు వారివి. ఏది ఎంచుకోవాలి అనేది పూర్తిగా వ్యక్తిగతం; ఎవరి ప్రాధామ్యాలు వారికి ఉంటాయి. ఎలా ఎంచుకోవాలి అనేది మాత్రం సార్వత్రికం. ఎవరినో ఆనంద పరచటం కోసం, ఏదో ఎంపిక చేసు కొనేకంటే 'నా స్వప్నం, నా లక్ష్యం , నా జీవితం' అనుకున్నప్పుడే అది సరైన ఎంపిక అవుతుంది. ఎవరి కోసమో కష్టపడి ఎంపిక చేసుకోకండి, ఇష్టపడి మీ కోసం ఎంపిక చేసుకోండి.
ఎంపిక ప్రభావం రెండు రకాలు - స్వల్ప కాలం, దీర్ఘ కాలం. ఎంపిక కు సరైన సమయం చాల అవసరం. ఎంపిక ఏదైనా మన శక్తి సామర్ధ్యాల మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి, అప్పుడే ఎదురు దెబ్బ తగిలినా తట్టుకుని ముందుకు దూసుకు వెళ్లి మన లక్ష్యం చేరుకుంటాం.
ప్రతి ఒక్కరు తన జ్యోతి ని తనే వెలిగించు కోవాలి, తన జ్యోతి వెలుగుల్లో తాను పయనించాలి. మీ భవిత కు మీరే విధాతలు !
Telugu books online download - https://drive.google.com/


