మృత్యుంజయ మహా మంత్రం


ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ||


తాత్పర్యం: సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!



దైవాధీనం జగత్సర్వం
మంత్రాధీనంతు దైవతం


తాత్పర్యం: జగత్తంతా దైవానికి ఆధీనమై ఉంటుంది.  అట్టి దైవం  మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. ఈ సూక్తిననుసరించి మంత్రోపాసనకు దైవం వశమవుతోందని తెలుస్తోంది. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రాల లోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైన మహాశక్తి  ఉత్పన్నమవుతుంది. అది మన ఊహకందనిది.


ref:


http://prasad-akkiraju.blogspot.com/2010/08/gaayatri-mariyu-mahaa-mrutyumjaya.html


http://telugu.devotionalonly.com/?cat=5


http://bhakthikusumam.blogspot.com/2007/11/maha-mrityunjay-mantra.html


http://sampradayam.wordpress.com/

Popular Posts