గాయత్రి మంత్రం


న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్‌ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము.



ఓం భూర్భువస్వః 
తత్సవితుర్వరేణ్యమ్‌
భర్గోదేవస్య ధీమహి 
ధియోయోనః ప్రచోదయాత్‌

తాత్పర్యం: ప్రణవ మంత్రంగా, భూః భువః సువః అనే మూడు వ్యాహృతులుగా ఉంటూ ఎవరు మన బుద్ధిని ప్రేరేపిస్తారో, సమస్తాన్ని సృష్టించే ఆ జ్యోతిర్మయ రూపాన్ని ధ్యానిద్దాం.

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి -


ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.


భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).


భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).


స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).

తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.

సవితుః = ఈ సృష్టి కర్త.

వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.

భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).

దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.

ధీమహి = హ్రుదయాన్తరాలలొ (అత్మలో ఏకమై)

యః = ఆ పరమేశ్వరుడు.

నః ద్యః = మా బుద్ధులను.

ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్య్దయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.


ref:


http://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80_%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81

    Popular Posts