తెలుగు నవ్వుల పందిరి

నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం

1.

"నాకు చాలాకాలంపాటు బతకాలని ఉంది డాక్టర్. ఏమైనా హెల్త్ టిప్స్ చెబుతారా?" అడిగాడు రాము.
"పెళ్ళి చేసుకోండి" సలహా ఇచ్చాడు డాక్టర్.

"అలాగైతే ఎక్కువ కాలం బతుకుతారా?" ఆశ్చర్యపోయాడు రాము.
"అదేం లేదులే. కాకపోతే అప్పుడు కాలం భారంగా గడుస్తూ ఎక్కువ కాలం బతికినట్టు అనిపిస్తుంది" అసలు సంగతి చెప్పాడు డాక్టర్.


3.

"నువ్వు ప్రతి అమ్మాయినీ ఏ పార్కుకో, బీచికో తీసుకెళ్ళకుండా గుడిలోకి తీసుకెళ్ళి 'I Love You' అని చెబుతావెందుకు?" సందేహంగా అడిగాడు శేఖర్.
"గుడిలో అయితే చెప్పులేసుకోవడానికి వీలుకాదు కదా" చెప్పాడు రాజు

4.

చెకప్ కోసం పిల్లలను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళారు దంపతులు. భర్త ఒడిలో పిల్లాడున్నాడు, భార్య ఒడిలో పాప్.
"బాబుది మీ పోలికే" నాడి చూస్తూ అన్నాడు డాక్టర్. నవ్వి ఊరుకున్నడు భర్త.
"మీ పాప చాలా ముద్దుగా ఉంది" చెప్పాడు డాక్టర్. నవ్వి ఊరుకుంది భార్య.
"వచ్చిన ప్రతివాళ్ళ్తో ఇలా ముద్దుగా ఉన్నారనే చెబుతారనుకుంటా" అన్నాడు భర్త.
"లేదు. నిజంగా నాకు నచ్చిఏనే చెబుతాను"
"నచ్చకపోతే?"
"మీ పోలికే అంటాను"

5.

" ఏమయ్యా ఈశ్వర్ ప్రతిరోజు ఉదయం ఆఫీసు కి లేటుగా వస్తున్నావు, సాయంకాలం ఇంటికి త్వరగా వెళ్తున్నావు. ఏంటి సంగతి ?" అడిగాడు ఆఫీసర్ కోపంగా .
" రెండు సార్లు లేట్ ఐతే బాగుండదని.........." నసిగాడు ఈశ్వర్ వినయంగా .

6.


జడ్జి: "నువ్వెన్టయ్య మాటిమాటికి వాళ్ళింట్లోనే దొంగతనం చేస్తున్నావు?"

దొంగ: " నేను వాళ్ల ఫ్యామిలీ దొంగని సార్."

7.


డిశ్చార్జ్ అయి వెళ్లబోతున్న పేషెంట్ తో " ఇప్పుడు తేలిగ్గానే ఉంది కదూ!" అడిగాడు డాక్టర్.

"కరక్టే..... డాక్టర్! ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది." అంటూ జవాబిచ్చాడు పేషెంట్ పర్సు తడుముకుంటూ.

8.


"అయ్యగారూ... మీ ఇంట్లో ఇక నేను పనిచెయ్యను. ప్రతిచిన్నదానికీ అమ్మగారు ఊరికే తిట్టిపోస్తున్నారు" చెప్పాడు నౌకర్.

"అబ్బా.. ఆ మాత్రం మాటపడలేవురా?" సర్ది చెప్పబోయడు యజమాని."నాకేం ఖర్మండీ... ఆమే తిట్లన్నీ పడడానికి నేనేమైనా ఆవిడ మొగుడినా?" వెళ్తూ అన్నాడు నౌకర్.

9.

"ఆఁ..... ఏవోయ్ వెంకట్రావ్! రాత్రి ఎనిమిదైంది. అసలే కొత్తగా పళ్ళైనవాడివి. ఇంటికి వెళ్ళాలనిపించడంలేదా? ఇంకా పని చేస్తూనే ఉన్నావు?" మెచ్చుకోలుగా అన్నాడు officer.

"ఏం లేదు సార్. మా ఆవిడ కూడా ఉద్యోగం చేస్తుంది. ముందుగా ఎవరైతే ఇంటికి చేరుతారో వాళ్ళు వంట చేయాలి" రహస్యం చెప్పాడు వెంకట్రావు.

10.

భర్త కోసం ఆఫీసుకు ఫోన్ చేసింది ధనలక్ష్మి. "కొంచెం మా ఆయన్ను పిలుస్తారా?" అడిగింది ఆపరేటర్ని.

"number please" అడిగింది ఆపరేటర్."నెంబరేమిటి నీ బొంద. నాకేమైనా పదిమంది మొగుళ్ళనుకున్నావా?" కయ్*మంది ధనలక్ష్మి.

11.

మీ ఆవిడకు నీ మీద ప్రేమ ఎక్కువ కదరా?" అడిగాడు సుందర్

"అవును.. మరి అంత చలిలో కూడా స్వెట్టర్ తొడిగి మరీ నా చేత అంట్లు తోమిస్తుంది..!" చెప్పాడు వినోద్.

12.

ఈ మధ్య ఇంటికి వెళ్లాలంటే భయమేస్తుందిరా?" అన్నాడు సూరిగాడు

"ఎందుకురా అంత భయం?" అడిగాడు రామారావు

"నా భార్య ఎందుకు లేటని క్లాస్ పీకుతుందిరా..!" అసలు విషయం చెప్పాడు సూరిగాడు

"ఎంత పిరికివాడివిరా..! ధైర్యంగా రెండు పెగ్గులేసుకుని ఇంటికి వెళ్లు అంతా సరిపోతుంది..!" సలహా ఇచ్చాడు

రామారావు "అయ్యబాబోయ్ ఏం సలహా ఇచ్చావ్‌రా? తప్పతాగితే నా కళ్లకి ఒకేసారి ఇద్దరు భార్యలు కనిపిస్తారు రా..!"

13.

"నీ ఆఖరి కోర్కె ఏమిటో అడగవయ్యా?" ఉరిశిక్ష పడిన సోమును అడిగాడు జడ్జి"

మా ఆవిడను పిలిపించండి.. కసితీరా తిట్టాలని ఉంది...!" చెప్పాడు సోము.

14.

నీ భార్యను ఎందుకు చంపావు? అని అడిగాడు జడ్జి" ముద్దాయిని

"పసుపు కుంకుమలతో పోవాలని కోరితేనూ..!" బాధపడుతూ చెప్పాడు ముద్దాయి

15.

" నేనంటే నా భార్యకు ఈ మధ్య ఎంతో ఇష్టం పెరిగింది." గర్వంగా అన్నాడు రాజు

"ఎలా చెప్పగలవు ?" అడిగాడు గోపి.

"అర్ధ రాత్రి ఒంటి గంటకు ఇంటికి వస్తున్నా అంట్లు తోమేందుకు వేడి నీళ్ళు పెట్టి ఇస్తుంది.బొగ్గుపొడికి బదులు నిర్మా ఇవ్వడం మొదలు పెట్టింది.బట్టలు ఉతికెందుకు సబ్బులో నానేసి రెడిగా వుంచుతుంది. అన్నం తినదానికి నేనెంత కష్టపడతానో అని ఏమీ మిగల్చకుండా అని మొత్తం తినేసి గిన్నెలు ఖాళీ చెసేస్తుంది" అసలు సంగతి చెప్పాడు రాజు.

16.

"బ్యాంకు వాడి కూతురిని పెళ్ళి చేసుకోవడం చాలా తప్పయిందిరా !" విచారం గా అన్నాడు సూరి.

"ఏమయ్యింది ? మంచి కుటుంబం , బ్యాంకు సంబంధం , ఇక కట్న కానుకలకు లోటు వుండదని అంటూ ఎగిరి గంతేసి చేసుకున్నావుగా పెళ్ళి ?" అడిగాడు రాము.

" అంతా నా ఖర్మకు వచ్చింది.కట్నం గా ఇచ్చిన ప్రతీ వస్తువుపై గోపాలం గారి ఆర్ధిక సహాయం తొ అని రాయించి మరీ ఇస్తున్నాడు మా మామగారు. ఇంటికి వచ్చే వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతున్నాను" ఏడుపు ముఖం తో అసలు సంగతి చెప్పాడు సూరి.

17.

విజ్ఞాన్‌ : నా అభిమాన హీరో నటించిన సిన్మాలన్నీ కనీసం నాలుగైదు సార్లు చూస్తాను తెలుసా.

జానీ : ఏం పాపం ఒక్కసారి చూస్తే అర్ధం కాదా.

18.

అబ్బాయిలూ! అమ్మయిని ఎంపిక చేసుకునేటప్పుడు ఈ సూత్రాలు గుర్తు పెట్టుకోండి.
1.ఆమె ఇంటిపనులు శ్రద్ధగా నిర్వర్తించాలి, వంట బాగా చేయాలి.
2. చలాకీగా కబుర్లు చెబుతూ మిమ్మల్ని ఎప్పుడూ నవ్విస్తుండాలి.
3. మీరు కష్టాలో ఉన్నా మీవెంటే ఉందాలి.

4.శృంగారంలో రంభను మరిపించాలి.

అన్నిటికంటే ముఖ్య సూత్రం ఈ నలుగురు అమ్మాయిలూ ఒకరికొకరు తారసపడకుండా చూసుకోవాలి.

19.

"ఏంటయ్యా నా ప్యాంట్‍కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు పోలీసు వేంకటస్వామి టైలర్‍తో.

"పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు టైలర్.

20.

నేను హైదరాబాద్ వచ్చిన మొదట్లో ఒక్క గోచిగుడ్డతో వచ్చాను. ఇప్పుడు కష్టపడి పది కోట్లు సంపాదించా..!" స్నేహితుడితో గొప్పలు చెబుతున్నాడు సుబ్బారావు

ఇంతలో..."అన్ని గోచీలు ఏం చేసుకుంటారు సార్...!" అని అడిగాడు కారు డ్రైవర్.

21.

పంకజం నన్ను ప్రేమిస్తుంది అంటావా ? 
ఎందుకు ప్రేమించదు ... అందర్నీ ప్రేమించి నిన్ను ఒక్కడినే ఎందుకు వదులుతుంది !!!


22.
"ఏవండోయ్... ఈ రోజు మన పళ్ళై సంవత్సరం నిండింది. వచ్చేటప్పుడు కోడిని పట్రండి. పలావ్ చేసుకుందాం" చెప్పింది సుగుణ. 
"ఎందుకే మనం చేసిన తప్పుకు దాన్ని బలిచెయ్యడం?" పెదవి విరుస్తూ అన్నాడు ప్రదీప్. 


23. 
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.


24. 
"పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి. 


"ఓ! ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు. 


"ఓహో అలాగా... రెండా?" అన్నాడు మురళి.


25. 
"నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను" 


"ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?" 


"కాదు..... నన్ను తోసేస్తుందని."


26. 
"మీరు చూస్తే చాలా చిన్న లాయర్లా ఉన్నారు. నా కేస్ టేకప్ చెయ్యగలరా?" సందేహంగా అడిగాడు క్లయింటు.
"ఫరవాలేదు. మీ కేసు పూర్తయ్యేనాటికి నేను పెద్ద లాయర్నవుతాను" అభయమిచ్చాడు లాయర్.


27. 
"చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే blood circulation దెబ్బకు బాగా పెరుగుతుంది" డ్రెస్సులు చూపిస్తూ షాపతను రసిక రాణి తో చెప్పాడు. 


"వీటిని ధరిస్తే blood circulation ఎలా పెరుగుతుంది" ఆశ్చర్యంగా అన్నది కవిత. "మీది కాదు మిస్. మిమ్మల్ని చూసేవాల్లది" చెప్పాడు షాపతను. అదో సోషల్ వర్క్ నూ ...


28. 
రాష్ట్రపతి ఓ కాలేజీని సందర్శించి అక్కడి విద్యార్ధులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. 


భవిష్యత్తులో వాళ్ళేమి కావాలనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. 


"నేను డాక్టర్‍ని అయ్యి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తా" అన్నడు రమణ.


"నేను ఇంజినీరునై దేశాన్ని అభివృద్ది పధంలోకి తీసుకెళ్తా" చెప్పాడు గోవింద్ "


నేను మంచి తల్లినవుతా. చదువుకున్న బాధ్యతాయుతమైన తల్లి వల్లనే పిల్లలు మంచి పౌరులుగ రూపొంది దేశం బాగుపడుతుందన్నారు నెహ్రూ గారు " అంది దీప. 


"మరి నువ్వో?" మౌనంగా ఉన్న హరిని అడిగారు రాష్ట్రపతి 


"నెహ్రూగారి మాటలను నిజం చేసేందుకు నా వంతు సహకారం అందిస్తా" దీపకేసి ఓరగా చూస్తూ చెప్పాడు హరి ! 


29. 
డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి. 


లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు.


వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు దొరికిపోయాడు.


వ్యాన్‍లో తీసుకెళ్తుంటే "హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయడం మామూలైపోయింది" అనుకున్నాడు విచారంగా.


జంధ్యాల మెచ్చుతునకలు

(ref : http://gsnaveen.wordpress.com/2006/10/12/jandhyala_meccutunakalu/)

“మనిషి జీవితం బాధల, సమస్యల మయమై ఉంటుంది. అలాంటి మనిషి థియేటర్‌కు వచ్చినపుడు అతనికి కాస్త నవ్వులు పంచి నవ్వించాలన్నదే నా ధ్యేయం. అందుకే నేను ఎక్కువగా హాస్యరస ప్రధానమైన చిత్రాలు రూపొందించడానికే ఇషపడతాను. రచయితగా నేను హాస్యమే రాశాను. దర్శకుడగా హాస్యాన్నే పంచుతున్నాను. అయితే హాస్యం రాయడం, హాస్య చిత్రాన్ని రూపొందించడం చాలా కష్టమైన పనులు. కొంచెం శృతి మించితే హాస్యం అపహాస్యమవుతుంది. హాస్యానికి, అపహాస్యానికీ మధ్య రేఖా మాత్రమైన భేదం మాత్రమే ఉంటుంది. నేను నా శక్తివంచన లేకుండా హాస్యాన్ని హాస్యంగా ఉంచడం కోసమే ప్రయత్నిస్తున్నాను…” ఇవి ఎవరి మాటలో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

నవ్వడం భోగం
నవ్వించడం యోగం
నవ్వకపోవడం రోగం


అంటూ తెలుగుచిత్ర సీమలో 1976 నుంచి 2000 వరకూ రారాజుగా వెలిగిన నవ్వులరాజు
జంధ్యాల వెంకట దుర్గా శివసుబ్రహ్మణ్యశాస్త్రివి! ఆయనకి రచయితగా మూడువందల యాభై చిత్రాలు, దర్శకుడిగా 39 చిత్రాలు ఆయన సృజనాత్మకతకు శాశ్వత చిరునామాలుగా నిలిచి వెలుగుతున్నాయి. నవ్వుకోసమే జీవించిన జంధ్యాల… మెచ్చుతునకల్లాంటి ఎన్నో హాస్యగుళికలు అందించారు. వాటిల్లో జీవిత సత్యాలు, బోలెడు ప్రాసలు, సినిమా నటీనటులకు సంబంధించినవి… ఎన్నో ఉన్నాయి. తెనాలి రామలింగ కవి హాస్యాన్ని పోలిన హాస్యోక్తులు మనకు ఎన్నో కనిపస్తాయి.

* ఆ నవ్వేమిటమ్మాయ్… ఆడపల్ల కాలు గడపదాటకూడదు. నవ్వు పెదవి దాటకూడదు… తెలుసా? కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూరములని బూరె పనికి రాదన్నాడు శాసకారుడు. మీకివమి తెలియవు! మీ ఇంగ్లీషు బళ్ళలో లింకన్ ఎప్పుడు పుట్టాడు? డంకెన్ ఎప్పుడుచచ్చాడు! ఇవే తప్ప… రాముడవరు, కృషుడవరు ఇవి చెప్పి తగలడరు!


* గత దశాబ్దంగా తమ ఒంపు సొంపులతో, ఆటపాటలతో ఆంధ్ర పేక్షకుల గుండెకాయల్ని వేరు శనక్కా యల్లా తినేస్తున్న సోదరీమణులు జ్యోతిలక్ష్మి, జయమాలినిల గురించి మనం చెప్పుకుందాం… ఈ సోదరీమ ణులిదరూ ఆంధ్రులపాలిట ఇషదవాలు. ఆవకాయ, గోంగూర లాంటివారు. ఈ పచ్చళ్లలో ఏదో ఒకటి లేనిద్ద్టే ఎౖ తెలుగువారి భోజనం ఎలా ఉండదో, వీరిదరిలో ఏ ఒక్కరెనా లేకుండా తెలుగు సినిమాయే అసలు ఉండదు.


* భర్త భార్యను ప్రేమించే పదతికి, భార్యభర్తను వేధించే పదతికి సరెన నిర్వచనం నా కవితారూపంలో ఇస్తా…
పెళయ్యే క్షణం దాకా ఆడది బెల్లం ముక్క
ఆ క్షణం నుంచి అదే ఆడది అల్లంచక్క-నీ పీక నొక్కో


* పన్నెండళ్ల దాకా ఆడది ఇండియా లాంటిది అందరూ ఎత్తుకుని ముద్దు పెట్టాలనుకుంటారు పన్నెండు నుంచి పదనిమిది దాకా ఆడది అమెరికాలాంటది ప్రతివాడు ఆ అందాన్ని అందుకోవాలని, పొందాలని చూస్తారు. 18 నుంచి 40 దాకా ఆడది ఇంగ్లాండ్ లాంటిది దూరం నుంచి చూసి ఆనందిస్తుంటారు 40 నుంచి 60 దాకా ఆడది ఆఫ్రికా లాంటిది చూడగానే జడుసుకొని పారిపోతారు!


* కృష్ణ గోదావరుల్లో ప్రవహించది నీరుకాదు, కన్నీరు… కట్నమిచ్చుకోలని కన్నెపలల కన్నీరు.


* ఇప్పుడే బుర్రలో ఓ మెరుపు మెరిసిందిరా. కొత్త ప్రాస కనిపెట్టాను. “క”తో ఇస్తా ఏకాకి… కాకీక కాకికకాక కోక… ఆ కాకీక కాకికి కాక కోకికా కుక్కకా…!? ఇందులో 24 “క”లున్నాయి… ఎలా ఉంది?


* పోనీ ఇంకోటిస్తా… “న” మీద
నాని నాని… నీనూనె నీనూనె నానూనె నూనె… నేనై నేను నీనూనె నా నూనేనని, నానూనె నీనూనననీఎ నిన్న నేనన్నానా ..నోనో.. నేన్నానా నున్నని నాన్నా… నెననై…ఇందు లో 56 ‘నాలున్నాయి లెక్కచూసుకో కావాలంటే.
* మొక్కుబడకి బుక్కులన్ని చదివినా కుక్కగొడుగు మొక్కలా, చెదలు కొటేసన చెక్కముక్కలా, కుక్కపీకేసన పిచ్చిమొక్కలా, బిక్కుమొహం వేసుకుని, వక్కనోట్లో కుక్కుతూ బొక్కుతూ డెక్కుతూ చుక్కలు లెక్కపెడుతూ, ఇక్కడే ఈ ఉక్కలో గుక్కపెట్టి ఏడుస్తూ, ఈ చుక్కల చొక్కా వేసుకుని డొక్కు వెదవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపనుగులా చక్కిలాలు తింటూ, అరటి తొక్కలా, ముంగిట్లో తుక్కులా, చిక్కుజుట్టు వేసుకుని ముక్కు పొడి పీలుస్తూ, కోపం కక్కుతూ, పెళ్లాన్ని రక్కుతూ, పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కినక్కి ఈ చెక్కబల్లమీద బక్కచిక్కి ఇలా పడుకోకపోతే ఏ పక్కకో ఓ పక్కకు వెళ్ళి పిక్క బలం కొద్ది తిరిగి, నీడొక్క శుద్దితో వాళని ఢక్కాముక్కీలు తినిపంచి, నీలక్కు పరీక్షించుకుని ఒక్క చక్కటి ఉద్యోగం చిక్కించుకొని, ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కు చెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసి. ఇందులో 56 ‘క్కా లు ఉన్నాయి తెలుసా?


* శ్రీకృష్ణ దేవరాయలు వంటి మహారాజు, కళా హృదయుడు తన మహామంత్రికి ‘అప్పాజీ’ అని పేరు పెట్టు కున్నాడంటే.. అప్పు ఎంత విలువనదో గ్రహించండి. ఇంగ్లీష్‌లో కూడా ‘డౌన్’ కంటే ‘అప్’ ఉన్నతమైన కాదా?


* మన భారతదశం చేసన పనే మనమూ చేయటం తప్పు కాదుకదా… మనదశం అహింసను పాటిస్తే మనమూ పాటిస్తాం. మనదశం క్రమశిక్షణ పాటిస్తే మనమూ అనుసరిస్తాం. ఇప్పుడు మనదశం ఏం చేస్తోంది? పరాయి దేశాలనుంచి వీరలెవల్లో అప్పులు చేస్తోంది. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకు హెచ్చొ మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటది భారతదశం అయితే రెండోది బెల్జియం. అంచేత అప్పు చేయటీం తప్పు చేయటం కాదు. అసలా మాట కొస్తే అప్పుచయటం భారతీయుడి జన్మహక్కు, ప్రథమ కర్తవ్యే మూనూ…. ఏషియాడ్‌లో మన గుర్తు గున్నాఎనుగు పేరు ఏమిటి? ‘అప్పూ’… మన వెజాగ్‌లో ఉన్న సింహాచలం దేవుడి పేరు ఏమిటి? సింహాద్రి “అప్ప”న్న.


* డబ్బు పెరిగినా, జబ్బు పెరిగినా ఆ తేడా ముఖంలోనే తెలుస్తుంది.


* ఫస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఈజ్ ది ఫస్ట్ ఆఫ్ ది లాస్,ట ఇన్ బిట్వీన్ టు జీరోస్ అంటే ఏమిటో చెప్పండి? ఫస్ట్‌లో మొదటి అక్షరం ‘ఎఫ్’, లాస్‌లో మొదటి అక్షరం ఎల్. ఇన్ బిట్వీన్ ట్టూ జీరోస్ అంటే ఫూల్!


* కుంతీ సెకండ్ సన్ బూన్… అదే భీమవరం… గారెన్‌కర్రీ… అదేనమ్మ తోటకూర


* ఈ మధ్య నేను కొన్ని కవితల్ని వ్రాశాను. మచ్చుకి ఒకటవిస్తాను వినండి.

"ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది?
ఎర్రగా ఉంటే బాగుండదు కనుక…
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?
నీలంగా ఉంటే బాగుండదు కనుక…
మలెతలగానే ఎందుకుంటుంది?లేల
నల్లగా ఉంటే బాగుండదు కనుకా
-ఇదివిన్నాక కూడా నేనెందుకు బ్రతికే ఉన్నాను
నాకు చావు రాలేదు కనుక!"

ఇటువంటి హాస్యోక్తులు, ఛలోక్తులు, పేరడీలు, ప్రాసలు వందలకొద్దీ రాసిన జంధ్యాల రచయితగా ఎంత విజయం సాధించారో దర్శకుడిగానూ అంతే ఘనవిజయం సాధించారు.


ref:



http://telugu-jokes.blogspot.com/

http://telugu.webdunia.com/entertainment/humour/jokes/

http://www.indusladies.com/forums/andhra-pradesh/49288-jokes-in-telugu.html

http://www.telugucomedyclub.com/

http://telugu-jokes.blogspot.com/


http://www.teluguone.com/vinodam/

http://www.teluguone.com/sarasam/

http://gsnaveen.wordpress.com/2006/10/12/jandhyala_meccutunakalu/
http://dir.jalleda.com/index.php?PID=79&sr=260&pp=10&cp=27&PHPSESSID=703de154d2714186f51dea0f99a7e8a3

Popular Posts