Gollapudi Comments
జిజ్ణాసి ఆలోచిస్తాడు. మేదావి విశ్లేషిస్తాడు. చరిత్ర విమర్శిస్తుంది. రాజకీయం దాన్ని వాడుకుంటుంది. కాని కాలం- నిష్కర్షగా, నిర్ధుష్టంగా, క్రూరంగా- అర్ధంలేని, అవసరం లేని నిజాల మీద ముసుగు కప్పి ముందుకు సాగిపోతుంది.
పరపతి ఉన్న వ్యక్తుల వెనక అవినీతిని పోషించేవారు కోకొల్లలుగా వుంటారు. సమకూర్చి పంచుకునేవారూ ఉంటారు. మరో విధంగా చెప్పాలంటే- నీ అవసరం ఎదుటి వ్యక్తికి ఉన్నప్పుడు- నీ బలహీనతల్ని ఆనందంగా పోషిస్తాడు. కారణం- "బలహీనత’ నువ్వు గర్వపడేదికాదు. అతను చేసే పనీ గర్వపడేదికాదు. కాగా- నీ తల వొంచేది. ఉదాహరణకి- రోజూ పూజకి పువ్వులు తెచ్చియివ్వడం భక్తి అనిపించుకుంటుంది. రోజూ చీకటిపడే సమయానికి విస్కీ తెచ్చియివ్వడం- నిన్ను లోబరుచుకునే గాలం అనిపించుకుంటుంది.
తాను వడికిన ఖద్దరు నూలుతో నేసిన బట్టను కట్టుకుని, మేకపాలు తాగి జీవించి, బడుగు మనుషులతో అడుగులు వేసిన ఒక బారిస్టరు- అవును- మహాత్ముడు- యిదే నేలమీద మొన్న మొన్ననే వున్నాడంటే మన పిల్లలు విడ్డూరంగా చూసే రోజులొచ్చాయి.
ప్రకృతికి నోరులేదు, ఎదిరించదు . విశ్వాసంగా , నమ్మకంగా ’అమ్మ’ లాగ ఆదరించే ప్రకృతి క్రమంగా ఛిద్రమయి పోతుంది. ఓపికున్నంతకాలం - తను కాలి వెలుగునిచ్చే శక్తి ప్రకృతి. ఏదో రోజు వెలుగూ ఉండదు, ప్రకృతి ఇచ్చే ఫలితమూ ఉండదు.విశ్వాసఘాతకుడైన మనిషి తన ముందు తరాల దోపిడికి నిర్జీవమై, దారుణమైన ’కృతఘ్నత’ కి లోనౌతాడు.
రాముడినీ కృష్ణుడినీ, హనుమంతుడినీ, గాంధీ, నెహ్రూలనూ యింటింటి పేర్లుగా సంస్కృతిలో భాగంగా నిలపడానికి బదులు ప్రాంతీయ తత్వానికి పాచికలుగా చేసే నాయకుల దశకి ఈ దేశం ప్రయాణం చేసింది.అచిరకాలంలో- మనుషుల, భాషల, ప్రాంతాల, కులాల, నదుల మధ్య గోడలు బలమయి, తమ హక్కులయి- గర్వపడే శక్తిగా మారి స్థిరపడతాయి. అలాంటి దయనీయమయిన దశలోనే ఒకప్పుడు బుడతకీచులు, ఈస్టిండియా కంపెనీవారూ మన దేశాన్ని కొల్లగొట్టడానికి విజయవంతంగా దిగబడ్డారు.చరిత్ర పునరావృతానికి యిప్పుడిప్పుడే వేళ్ళు నాటుతున్నాయి.
కీర్తికి కూడా ఒకొక్కప్పుడు కాలదోషం పడుతుంది. కీర్తిది దుర్మార్గమయిన రుచి. నిరుపరాయ్ కీ, ఐశ్వర్యారాయ్ కీ కాలం ఆ రుచిని వేర్వేరుగా పలకరిస్తుంది. కాని డబ్బు రుచి ఏనాటికీ మారాదు.
(http://koumudi.net/gollapudi/092809_s_varalakshmi.html)
Gurumurthy's Articles - http://gurumurthy.net/
Gurumurthy's Articles - http://gurumurthy.net/


