తెలుగు సామెతలు(Telugu Proverbs)

Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.

అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

ఇది అజ్ఞానానికీ, అతి తెలివికీ పరాకాష్టగా చెప్పే సామెత. తెలియక పోయినా తెలిసినట్లు నటించేవారి అంటించే చురక.

అల్లం కారంగా, ఘాటుగా ఉంటుంది; బెల్లం తీయగా ఉంటుంది. ఇక పుల్లగా ఉండేవి వేరే పదార్ధాలున్నాయి. అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటది అని ఎవరైనా అంటే వారికి అల్లం రుచి తెలియదు. బెల్లం రుచి తెలియదు. పుల్లగా ఉండేదేమిటో తెలియదు. కనుక ఒకటి అడిగితే మూడు విషయాలు తెలియవని చెప్పుకున్నారు. కనీసం తన తెలియనితనాన్ని దాచుకోవాలన్న జ్ఞానం కూడా వారికి లేదన్న మాట.

ఇదే అర్ధంలో చెప్పే మరొక సామెత:

పంచపాండవులెందరంటే మంచం కోళ్ళలాగ ముగ్గురు అని రెండు వేళ్ళు చూపినట్లు.



మనకు నచ్చితే హనుమంతుండు లేకపోతె కోతి !



ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే , మూతి మీసాలు కలినవట !



బెల్లం వుంటే ఈగలు ముసురుతాయి !



భోజుడి వంటి రాజు కలిగితే కాళిదాసు వంటి కవి వుంటాడు !



మడ్డి ముండకు మొగలి పూలిస్తే మడిచి ముడ్డి లో పెట్టు కుందిట !



మీ ఇంటికి వస్తాను నాకేమి పెడతావు , మా ఇంటికి వస్తావు నాకేమి ఇస్తావు !



మెతుకులు చల్లితే కాకులు తక్కువా !



యోగి భోగి రోగి కి నిద్ర లేదు !



రాముని వంటి రాజు వుంటే హనుమంతుని వంటి బంటు వుంటాడు !



లక్ష నక్షత్రాలు అయిన ఒక చంద్రుడికి సరి కావు !



విత్తం కొద్ది వైభవం , విద్య కొద్ది వినయం !



వెంట్రుకలు వుంటే ఏ కొప్పు అయిన పెట్టు కోవచ్చు !



ఏనుగు పడుకున్నా గుర్రం అంత ఎత్తు !



కాని కాలం లో కర్రే పాము అవుతుంది !



ఏ ఎండ కి ఆ గొడుగు !



శంఖం లో పోస్తే తీర్ధం , పెంకు లో పోస్తే నీళ్ళు !



శనగలు తింటూ ఉలవలని చెప్పి పత్తి విత్తులు చేతిలో పెట్టినట్లు !



శ్వాస వుండే వరకు ఆశ వుంటుంది !



ఒక్కొక్క రాయి తీస్తూ వుంటే కొండలు అయినా తరుగుతాయి !



సంతోషం సగం బలం !

ref:


Popular Posts