తెలుగు మహాభారతము
నన్నయ్య గారు ఆది కవి. వీరు మహా భారతాన్ని తెలుగులో వ్రాయ ప్రారంబించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని(అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషులు అయ్యారు. వీరు తెలుగు భాష కు ఒక మార్గాన్ని నిర్దేశించినారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య గారి అడుగు జాడలను అనుసరించిన వారే. నన్నయ్య గారు రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి లో వుండి ఈ మహా భారతాన్ని తెలుగులో వ్రాసినారు. తల్లి గోదావరి ఒడ్డున కూర్చోని, తన రాజయిన రాజ రాజ నరేంద్ర మహా రాజు గారికి చెప్పినదే ఈ మహా భారతము. నన్నయ గారు తెలుగు మాట్లాడేవారికి పూజనీయుడు.
(శరత్కాలపు రాత్రులు మెరిసే నక్షత్రాల పట్ల దొంగలైనాయి. - అంటే వెన్నెలలో చుక్కలు బాగా కనుపించటము లేదు - వికసించిన కలువల సుగంధాన్ని మోసుకుపోయే చల్లగాలి తో, పూల పరాగంతో ఆకాశం వెలిగి పోతున్నది. చంద్రుడు కర్పూరపు పొడి వంటి వెన్నెలను విరజిమ్ముతున్నాడు)
తిక్కన (1205 - 1288) గారు మహాభారతము లో నన్నయ్య రచించిన పర్వాలు కాకుండా మిగిలిన 15 పర్వాలను రచించారు. ఆది కవి నన్నయ ఆది పర్వము, సభాపర్వము, అరణ్యపర్వములో కొంతభాగము రచించి గతించిరి.
ఎఱ్ఱాప్రగడ గారు మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసినారు. నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని బాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్ఱాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్ఱాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినా అనిపిస్తుంది.
నన్నయ్య ఆంధ్ర మహాభారతము శ్రీకారము త్రిమూర్తులను స్తుతంచే ఈ సంస్కృత శ్లోకముతో జరిగినది
శ్రీ వాణీ గిరిజా శ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తేవేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్శ్రేయసే
(లక్ష్మీ సరస్వతీ పార్వతులను వక్షస్థలమునందును, ముఖమునందును, శరీరము నందును ధరించి లోకములను పాలించువారును, వేదమూర్తులును, దేవపూజ్యులును, పురుషోత్తములును అగు విష్ణువు, బ్రహ్మ, శివుదు మీకు శ్రేయస్సు కూర్తురు గాక!)
భారతంలో నన్నయగారి చివరిపద్యం - శారదరాత్రుల వర్ణన
శారదరాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్
జారుతరంబులయ్యె వికసన్నవ కైరవ గంధ బంధురో
దార సమీర సౌరభము దాల్చి సుధాంశు వికీర్యమాణ క
ర్పూర పరాగ పాండు రుచి పూరము లంబరి పూరితంబులై

ref: