SiriVennela Songs(సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు)





చందమామ రావే…జాబిల్లి రావే…కొండెక్కి రావే…గోగు పూలు తేవే
చందమామ రావే… జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే….జాజిపూల తావినీయ జాబిల్లి రావే

కలువ చలువ కళలు విరియ కొండనెక్కి రావే…
గగనపు విరి తోట లోని గోగుపూలు తేవే
చందమామ రావే…జాబిల్లి రావే…కొండెక్కి రావే…గోగు పూలు తేవే
చందమామ రావే… జాబిల్లి రావే
మునిజన మానస మోహిని యోగిని బృందావనం…
మురళీ రవలికి ఆడిన నాగిని బృందావనం
రాధ మాధవ గాథల రన్జిలు బృందావనం…
గోపాలుని మృదుపద మంజీరము బృందావనం
బృందావనం… హేయ్ కృష్ణా…ముకుందా మురారి…
కృష్ణా…ముకుందా మురారి…జయ కృష్ణా…ముకుందా మురారీ…
జయ జయ కృష్ణా…ముకుందా మురారీ…
చందమామ రావే… జాబిల్లి రావే… కొండెక్కి రావే…గోగు పూలు తేవే
చందమామ రావే… జాబిల్లి రావే


1.
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
ల ల ల ల లలలలలలలా

నా కోసమె చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
ల ల ల ల లలలలలలలా

నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు
ఏడేడు లోకాల ద్వారలు తలుపులు తెరిచే తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
ల ల ల ల లలలలలలలా

2.
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ

విశ్రమించ వద్దు ఏ క్షణం
విస్మరించ వద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయం రా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ

నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా
అ నింగి ఎంత పెద్ద దైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా
పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా
గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా
నిశా విలాసమెంతసేపురా ఉషొదయాన్ని ఎవ్వడాపురా
రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ

నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ
దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున
దేహముంది దైర్యముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున
ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ఆశయమ్ము సారధవును రా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా
ఆయువంటూ వున్నవరకు చావుకూడా నెగ్గలేక శవము పైనే గెలుపు చాటు రా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమీ

3.
జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే

కవినై…. కవితనై….. భార్యనై…. భర్తనై
మల్లెల దారిలో… మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ..నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని,కథల్ని,మాటల్ని,పాటల్ని,
రంగుల్ని,రంగవల్లుల్ని,కావ్యకన్యల్ని,ఆడపిల్లల్ని

మింటికి కంటిని నేనై.. కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై..
నాతో నేను సహగమిస్తూ..నాతో నేనే రమిస్తూ..
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని, కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని,
చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని

గాలి పల్లకిలోన తరలి నాపాట పాప ఊరేగివెడలె
గొంతువాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండెమిగిలే
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది

4.
చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక

బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంకా

5.
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగు కదా ?
వెన్నెల దీపం కొందరిదా ? అడవిని సైతం వెలుగు కదా ?
ఎల్లలు లేని చల్లని గాలి, అందరికోసం అందును కాదా ?

ప్రతీమదిని లేపే ప్రభాతరాగం, పదే పదే చూపే ప్రథాన మార్గం ..

ఏదీ సొంతంకోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం !

ఇది తెలియని మనుగడ కథ – దిశలెరుగని గమనము కద !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

బ్రతుకునలేని శృతికలదా ? ఎదసడిలోనే లయలేదా ?
బ్రతుకునలేని శృతికలదా ? ఎదసడిలోనే లయలేదా ?

ఏ కళకైనా, ఏ కళకైనా జీవితరంగం వేదికకాదా ?

ప్రజాధనం కాని కళావిలాసం, ఏ ప్రయోజనం లేని వృధా విలాపం.

కూసే కోయిల పోతే రాగము ఆగిందా ? పారే ఏరై పాడే మరో పదం రాదా ?

మురళికిగల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా !

తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?
గగనాల దాకా అల చేరకుంటే, మేఘాలరాగం ఇల చేరుకోదా ?
తరలి రాద తనే వసంతం ? తన దరికి రాని వనాల కోసం ?

6.
సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా నిన్నటి నీడలే
చుట్టమల్లె కష్టమొస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకుంటు
కాళ్ళు కడిగి స్వాగతించకు
ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా
లేని పోని సేవ చేయకు
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ పరుగులు తీయదా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

ఆశలు రేపినా అడియాసలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా ఆశలు రేపినా
నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా
కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా
కలతలనే నీ కిలకిలతో తరిమెయ్యవే చిలకమ్మా
నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి

సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా

7.
చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా 2
కళ్ళ ముందు కటిక నిజం
కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం
బ్రతుకును కానీయకు వ్యర్థం 2

స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు
కరుణను మరిపించేదా…చదువూ సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా…సాంప్రదాయం అంటే కరుణను

చుట్టూపక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా

నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది
రుణం తీర్చు తరుణం వస్తే…తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలపెట్టేస్తావా…యేరు దాటగానే రుణం తీర్చు



Popular Posts