కల్తీ కనిపెట్టేదాం !



తెలుగు ఈనాడు పేపర్ లో పడిన ఒక ఆర్టికల్ సారాంశం:

    ప్రస్తుతం అందరూ ఆర్గానిక్పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లే కొంటున్నారు. అవేమో చాలా ఖరీదు. కానీ వాటిని ఎలా పండించారో, పూర్తిగా సేంద్రీయ ఎరువులే వాడారా అనేది చాలామందికి తెలియదు. దాన్ని కనిపెట్టడం కూడా కష్టమే. ఇంట్లో కూడా చర్చ తరచూ వచ్చేది. ఇంట్లో అమ్మావాళ్లు పాలు, పండ్లు, కూరగాయలు... వంటి పదార్థాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడల్లా కల్తీని ఎలా కనిపెట్టాలని ఆలోచించేదాన్ని. చివరకు అదే నా పరిశోధనాంశం అయ్యింది. నేను ఒక పరికరం రూపొందించా. దాంతోపాటు పాలల్లో కల్తీని కనిపెట్టే కాగితాన్నీ తయారుచేశా. ఉదాహరణకు పంటల దిగుబడి అధికంగా రావడానికి రైతులు రకరకాల రసాయనాలు వాడతారు. అవశేషాలన్నీ కూరగాయలు, పండ్లపై అతుక్కుని ఉంటాయి. వాటిని శుభ్రం చేసినా కూడా పట్టాన పోవు. దాంతో రసాయనాలు ఆహారం ద్వారా మన జీర్ణాశయంలోకి వెళ్లి, తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయిస్కెచ్పెన్నుల్లో రంగును పీల్చుకునే స్పాంజి ఉంటుంది కదా... అలా రంగు అయిపోయిన స్పాంజికి రసాయనం కలిపా. స్పాంజిపై పండు లేదా కూరగాయకు సంబంధించిన రసం వేయాలి. అది నీలం రంగులోకి మారితే గనుక రసాయనాలు ఉన్నట్లేనని అర్థంచేసుకోవాలి.

    పాలల్లో కూడా ప్రస్తుతం పలు రసాయనాలను కలుపుతున్నట్లు చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈమేరకు పాలల్లో కల్తీ ఉందా లేదా కనిపెట్టడానికి నేను తయారు చేసిన కాగితం స్ట్రిప్ను ముంచితే చాలు.  సాధారణంగా పాలు తెలుపు రంగులో ఉండేందుకు సోడా, డిటర్జెంట్‌, యూరియా లాంటివి కలుపుతారు. అవి మన శరీరంలోకి వెళ్తే... రకరకాల సమస్యలు తప్పవు.  4 సైజు కాగితం విలువ చాలా తక్కువ. దాంతో చాలా స్ట్రిప్స్తయారు చేయవచ్చు దీన్ని ద్రావణంలో ముంచి ఆరబెట్టడం వల్ల లేత పసుపు వర్ణంలో ఉంటుంది. ఇది ఇట్టే రసాయనాలను కనిపెట్టగలదు. దీన్ని పాలల్లో ముంచి తీయాలి. కల్తీ ఉంటే గనుక కాగితం ఇంకాస్త ముదురు పసుపు రంగులోకి మారుతుంది. అయితే కొన్న పదిరోజుల్లోపే స్ట్రిప్స్ను వాడేయాలి. లేదంటే నిరుపయోగం. దీనిని యూరియా డిటెక్షన్స్ట్రిప్అని అంటాం.


Popular Posts