వారెన్ బఫెట్ సలహాలు(Warren Buffet Rules)




* జీవితంలో మనం రెండు నియమాలు పాటించాలి. ఒకటి ఎప్పుడూ డబ్బులు పోగొట్టుకోకూడదు. ఇది మొదటిది. ఇక రెండోది.. మొదటి నియమాన్ని ఎప్పుడూ మరిచిపోకపోవడమే.. 

* తక్కువ ధరకు ఓ అద్భుతమైన కంపెనీని కొనుగోలు చేయాలి కానీ.. అద్భుతమైన ధరకు ఓ మామూలు కంపెనీని కొనుగోలు చేయకూడదు.  

* పదేళ్లపాటు నువ్వు స్టాక్‌ మార్కెట్‌ జోలికి వెళ్లకపోయినా కూడా నీదగ్గరున్న షేర్ల విషయంలో నిశ్చింతగా, హాయిగా ఉండగలిగే షేర్లను మాత్రమే నువ్వు ఎంపిక చేసుకోవాలి.. 

* పదేళ్లపాటు ఒక షేరును అట్టేపెట్టుకోవాలనే ఆలోచనే నీకు లేనప్పుడు, పది నిమిషాలు కూడా ఆ షేరును నీ దగ్గర ఉంచుకునే ఆలోచన చేయకు. 

* నేను ధనవంతుడ్ని అవుతానని నాకు తెలుసు. ఈ విషయంలో నాకు ఏ క్షణంలోనూ సందేహం కలగలేదు.  

* నీపైన నీకు నమ్మకం కలిగి ఉండటమే నువ్వు పెట్టే అత్యంత ముఖ్యమైన పెట్టుబడి. 

* షేర్లయినా, కాలికి తొడుక్కునే సాక్సులయినా తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా అని ఎగబడను; అవి నాణ్యమైనవయితేనే కొనేందుకు ఇష్టపడతాను.  

* ఒకటే ఆదాయం మార్గంపై ఎన్నడూ ఆధారపడకూడదు.  రెండో ఆదాయ వనరును సృష్టించేందుకు పెట్టుబడి పెట్టు. 

* నీకు అవసరం లేని వస్తువులను ఇప్పుడు నువ్వు కొంటే, త్వరలో నీకు అవసరమైన వస్తువులను నువ్వు అమ్ముకోవాల్సి వస్తుంది.  

* నువ్వు ఏం చేస్తున్నావో తెలియకపోతేనే నష్టం వస్తుంది. అందుకే నీకు ఏ వ్యాపారమైనా అర్థంకాకపోతే ముందు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాకే పెట్టుబడులు పెట్టాలి. 

* ఖర్చు పెట్టాక మిగిలిన డబ్బులను పొదుపు చేయడం కాదు.. పొదుపు చేశాక మిగిలిన డబ్బులను ఖర్చు పెట్టు.



Popular Posts