తెలుగు వేమన శతకము & సుమతి శతకము
Note: You may need eenadu font to read this blog item. Please refer this link to install font.
నేరనన్నవాఁడు నెరజాణ మహిలోన
నేర్తునన్నవాఁడు నిందజెందు
ఊరకున్నవాఁడె యుత్తమయోగిరా!
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : ఓవేమా! ఈ ప్రపంచములో తనకు అన్నియు తెలుసునని డంబములు చెప్పువాడు తుదకు నిందలపాలగును. తనకు ఏమియు తెలియదని చెప్పువాడు మంచి తెలివితేటలు గలవాడు. అనవసరముగ ఏమియు చెప్పక మౌనముగ నుండువాడే గొప్ప బుద్ధిమంతుడు.
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : నీచుడు డంబములు చెప్పుచుండును. మంచివారు మెల్లగా మాటలాడుచుందురు. తక్కువ ఖరీదైన లోహము అయిన కంచు దడదడమని మ్రోగునట్లు, యెక్కువ ఖరీదైన బంగారము అను లోహము మ్రోగదుకదా
నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినురవేమా.
తాత్పర్యము : ఓ వేమా! నీటితో నిండియున్న నదులు గంభీరముగ నిలచి పారుచుండును. చిన్న సెలయెరులు పైకి పొర్లి వేగముగ ప్రవహించు చుండును. ఛెడ్డ గుణములు గలవారు మాటలాడి నంతటి తొందరగా మంచి గుణములు గలవారు మాట్లాడరు.
మిరపగింజచూడ మీద నల్లగనుండు
గొరికిచూడ లోనజురుకు మనును
సజ్జనులగువారి సారమిట్లుండురా!
విశ్వదాభిరామ వినురవేమ.
తాత్పర్యము : మిరపగింజ చూచుటకు నల్లగా ఉండును. నోటిలో పెట్టుకొని పంటితో కొరికినచో చురుక్కుమని మండును. ఆ విధముగనే మంచి గుణములు గలవారిలో గొప్ప ప్రభావముండునని తెలిసికొనుము.
వినదగు నెవ్వరుచెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
కనికల్ల నిజము దెలిసిన
మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఎవరు ఏం చెప్పినా వినవచ్చు. విన్నా వెంటనే తొందరపడకుండా బాగా పరిశీలన చేయాలి. అలా పరిశీలించి అది నిజమో అబద్దమో తెలుసుకొన్న మనిషే ధర్మాత్ముడు.
వెలయాలివలనఁ గూరిమి
గలుగదు మరి గలిగెనేని కడతేరదుగా
పలువురు నడిచెడి తెరుపునఁ
బులు మొలవదు మొలిచెనేని బొదలదు సుమతీ!
తాత్పర్యం:పదిమంది నడిచే బాటలో పచ్చగడ్డి మొలవదు. ఒకవేళ మొలిచినా పెరగదు. ఆ విధంగానే వేశ్యవల్ల ప్రేమ లభించదు. ఒకవేళ లభించినా ఎక్కువకాలం నిలవదు.
సరసము విరసము కొరకే
పరిపూర్ణ సుఖంబు అధిక బాధల కొరకే
పెరుగుట విరుగుట కొరకే
ధర తగ్గుట హెచ్చుకొరకే తధ్యము సుమతీ!
తాత్పర్యం: హాస్యపు మాటలు విరోధము కొరకే. సంపూర్ణ సౌఖ్యాలు విస్తారమైన బాధల కోసమే. పొడవుగా ఎదుగుట విరిగిపోవడానికే. ధరవరలు తగ్గడం మళ్లీ పెరగడానికే అని మనుషులు తెలుసుకోవాలి.
అల్లుని మంచితనంబును
గొల్లని సాహిత్యవిద్య కోమలి నిజమున్
బొల్లున దంచిన బియ్యము
దెల్లని కాకులును లేవు తెలియర సుమతీ!
తాత్పర్యం: అల్లుని మంచితనం, గొల్లవాని పాండిత్యజ్ణ్జానము, ఆడుదానియందు నిజము, పొల్లుధాన్యములో బియ్యము తెల్లనిరంగుకాకులు లోకములో వుండవు
వేమన శతకము

సుమతి శతకము

ref:
Vemana Padyalmulu - http://www.archive.org/stream/vemanapadyamulu024991mbp
Vemana Padyalu - http://en.wikipedia.org/wiki/Vemana
Vemana Padyalu/Poems - http://www.bharatwiki.com/index.php?title=Vemana
Telugu Satakalu (Sumati, Vemana) - http://www.teluguwebsite.com/Telugu_Sethakamulu.html
Vemana Padyalu/Poems - http://www.bharatwiki.com/index.php?title=Vemana
Telugu Satakalu (Sumati, Vemana) - http://www.teluguwebsite.com/Telugu_Sethakamulu.html
Sumati Satakam - http://members.tripod.com/~RKSanka/telugu/sumati.html
Sumati Satakam - http://achutapavan.tripod.com/Telugu/SumatiSatakam/index.htm
Sumati Satakam - http://achutapavan.tripod.com/Telugu/SumatiSatakam/index.htm