పిల్లలు - చదువులు

Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.

జీవితం బహుదూరం ప్రయాణం చేయాల్సిన మారథాన్‌ పరుగు లాంటిదని, వంద మీటర్ల పరుగు పందెం కాదనే ఈ వాస్తవాన్ని తల్లి దండ్రులు గుర్తించాలి. అలాగే జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించిన వారు తమ పాఠశాల, కళాశాల విద్యా సమయంలో అత్యున్నత మైన ర్యాంకులు సాధించిన వారుకాక పోవచ్చునని, విద్యా సమయంలో సమగ్రమైన వ్యక్తిత్వాన్ని అలవరుచుకున్నవారు మాత్రమే విజయం సాధిస్తారని గుర్తించాలి. దీనికి ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి, జిఎమ్‌ఆర్‌ గ్రూపు అధినేత గ్రంధి మల్లిఖార్జున రావు, డాక్టర్‌ రెడ్డీస్‌ అధినేత అంజిరెడ్డి ఉదాహరణలు.

నీటి మాదిరిగానే జీవితం కూడ తన స్థాయిని క్రమంగా అందుకుంటుందని, అందువల్ల పిల్లల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే గతంలో లేని ఎన్నో అవకాశాలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయని, అందువల్ల పిల్లలను అతిగా పీడించాల్సిన అవసరం ఏమాత్రం లేదని, నోబుల్‌ బహుమతి పొందిన వారు కూడా బాల్యంలో అసాధారణ ప్రజ్ఞావంతులు కాదని గుర్తించాలి.

పిల్లలు సహజంగా పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలి, సాధారణ ప్రజలు కూడా ఈ మారథాన్‌ పరుగులో విజయం సాధించగలరు. హైస్కూల్‌ స్థాయిలో అత్యుత్తమ గ్రేడు సంపాదించిన వారు తర్వాత జీవితంలో రాణించలేకపోవచ్చునని, చదువుకు, విజయానికి సంబంధం లేదు. కిండర్‌ గార్డెన్‌, ఎల్‌కెజి అడ్మిషన్ల కోసం పిల్లల మధ్య పోటీ చాల అసహజం.

చదవడం అనేది చాలా ముఖ్యమే అయినా, చదువు అంటే ఏమిటో తల్లిదండ్రులకు స్పష్టమైన అవగాహన ఉండాలి, నూటికి నూరు మార్కులు సంపాదించడం చదువు కాదు.
పిల్లల్లో తెలియని దాని గురించి ప్రశ్నించే గుణం అలవాటు చేయాలి. చదువు విద్యార్థుల మేధస్సులో ఆలోచనలు రేకెత్తించాలే తప్ప సమాచారాన్ని నింపరాదు.


ref:

Popular Posts