జీవితం అంటే గమ్యం కాదు… గమ్యం కోసం చేసే ప్రయాణం
గెలుపు అంటే అనుకున్నది సాధించటం కాదు , సాధించిన దానిని నిలబెట్టుకోవటం ... అదో నిరంతర ప్రయాణం.
గెలుపు అనేది పాదరసం లాంటిది, సరిగ్గా పట్టుకోక పొతే వేళ్ళ మధ్య లో నుంచి జారిపోతుంది.
ప్రయత్నించే వాడు గెలుస్తాడు లేదా వోడి పోతాడు, కాని ప్రయత్నించని వాడు తప్పకుండ వోడి పోతాడు.
సమస్య అనేది నీరు వంటిది. నీటికి ఒక ఆకృతి లేదు, అలాగే సమస్య కి కూడా. ఒక సమస్య పెద్దదా చిన్నదా అనేది చూసే మనిషి దృక్పధం మీద ఆధార పది వుంటుంది.
సమస్య తీవ్రత ని తగ్గించాలంటే ఒకే ఒక మార్గం , ఏదో ఒక 'పని' కల్పిచుకోవటం. పని లో పడితే అన్ని మర్చిపోతాం.
అద్దాలు ఏ రంగులో ఉంటాయో ఆ రంగు లోనే అన్ని వస్తువులు కనపడతాయి. అలాగే మన ఆలోచనలకూ ఏ రంగు పులిమితే అదే రంగు లో జీవితం కనపడుతుంది.
ఊహ కు వాస్తవానికి చాలా తేడా వుంది. అది తెలిసిన మనిషి జీవితం ఆనందమయం.
మనిషి అసంతృప్తి కి కారణం , వంతెనలు కట్టవలసిన చోట గోడలు కట్టడమే.
సమస్య కన్నా పెద్ద సమస్య , దాని మీద వున్నా భయం ; ముందు ఆ భయాన్ని పారద్రోలండి.
సమస్య అనేది లేకపోతె జీవితం లో కొత్తదనమే లేదు.
చీకటి వెనుక వెలుగు వెన్నెల తప్పకుండ వస్తాయి, అది ప్రకృతి సహజం.
మనకు చాల తెలుసు, కాని తెలిసిన దాన్ని నిర్వహించలేక పోవటమే వోటమి కి తొలి మెట్టు.
అవకాశం దానికి అదే ఎప్పుడు రాదు, మనమే కల్పించుకోవాలి.
జీవితం లో దేనికి 'ఆలస్యం' అంటూ వుండదు.
అంకితభావం అంటే పట్టుదలతో కృషి చెయ్యటమే.
విజయం కి మూల సూత్రం - ఎప్పుడు ఏ పని ఎలాగా ఎందుకు చెయ్యాలో , దాని వల్ల లాభం ఏంటో కరెక్ట్ గా తెలుసు కోగలగటం.
కృషి వుంటే మనుషులు ఋషులు అవుతారు. ఏ మనిషి విజయం లోనికి తొంగి చూసినా, కనపడేది ఒకే ఒక సూత్రం - కృషి ఉంటేనే జీవితం లో పైకి వస్తాం. కృషి వుంటే ఒక మార్గం లో అపజయం పొందిన వేరే మార్గం లో జయం కలుగుతుంది.
తమకి ఏమి కావాలో , అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వాళ్ళు జీవితం లో పైకి వస్తారు. ఏ గమ్యానికి అయినా చాల దారులు వుంటాయి, నీకు ఏది సరయినదో వెతికి పట్టుకోవటమే జీవితం.





ref: యండమూరి 'విజయానికి 5 మెట్లు' & 'విజయం వైపు పయనం'


















