అన్నమయ్య సంకీర్తనలు
Note: You may need eenadu font to read this blog item.Please refer this link to install font.
అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503) తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు). అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
చందమామ రావే జాబిల్లి రావే అంటే వేంకటేశుడు ముద్దలు తిన్నాడో తినలేదో కానీ, తెలుగు పిల్లలు మాత్రము గబుక్కున తింటారు. జోఅచ్యుతానంద జో జో ముకుందా అంటే ముకుందుడు నిద్ర పోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు మాత్రము హాయిగా నిద్ర పోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు.
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేల శేషుల పడగల మయము॥
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిల మునులకు
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము॥
చెంగట నల్లదివో శేషాచలము
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మ మయము॥
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకల సంపద రూప మదివో
పావనముల కెల్ల పావన మయము॥1.
అలమేలుమంగనీ వభినవరూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ
గరుడాచలాధీశు ఘనవక్షముననుండి పరమానంద సంభిరతవై నెరతనములు జూపి నిరంతరమునాథుని హరుషింపగ జేసి తిగదమ్మ
శశికిరణములకు చలువలచూపులు విశదముగా మీద వెదజల్లుచు రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ వశముజేసుకొంటి వల్లభునోయమ్మ
రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు పట్టపురాణివై పరగుచు వట్టిమాకులిగిరించు వలపుమాటలవిభు జట్టిగొని వురమునసతమైతివమ్మ
2.
పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలోననాయందు మంచితనమేది
అనంతాపరాధములు అటునేముసేసివి అనంతమైనదయ అది నీది నినునెఱగకుండేటి నీచ గుణము నాది ననునెడయకుండేటి గుణము నీది
సకలయాచకమే సరుసనాకుపని సకలరక్షకత్వము సరి నీపని ప్రకటించినిన్ను దూరేపలుకేనా కెప్పుడూను వెకలివైనను గాచేవిధమునీది
నేరమింతయు నాది నేరుపింతయు నీది సారెకు అజ్ఞాని నేను జ్ఞానివి నీవు యీరీతి వేంకటేశయిట్టేనను నేలితివి ధారుణిలో నిండెను ప్రతాపమునీది
3.
ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా
పడతికి చనుగవమెరుగులు పైపై పయ్యెద వెలుపల కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు వుడుగని వేడుకతో ప్రియుడొత్తిన నఖశశిరేఖలు వెడలగవేసవికాలపు వెన్నెలకాదుకదా
ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల వొద్దికలాగులివేమో ఊహింపరే చెలులు గద్దరి తిరువేంకటపతి కొగిటియధరామృతముల అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా
4.
కొలిచిన వారల కొంగుపైడితడు బలిమి తారక బ్రహ్మమీతడు
యినవంశాంబుధి నెగసిన తేజము ఘన యజ్ఞంబుల గల ఫలము మనుజరూపమున మనియెడి బ్రహ్మము నినుపుల రఘుకుల నిథానమితడు
పరమాన్నములోపలి సారపుజవి పరగినదివిజుల భయహరము మరిగినసీతా మంగళ సూత్రము ధరలో రామావతారంబితడు
చకితదానవుల సంహారచక్రము సకలవన చరుల జయకరము వికసితమగు శ్రీవేంకట నిలయము ప్రకటిత దశరథ భాగ్యంబితడు
5.
విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము
మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల మరులు వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము యీడమాకు పొడచూపె ఇహమేపోపరము
కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి యీటులేని శ్రీ వేంకటేశుడితడు వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము
6.
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య ధాముడు రణరంగ భీముడు వాడే
వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు శరుడు రాక్షస సంహరుడు వాడే స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా గురుడు సేవకశుభకరుడు వాడే
ధీరుడు లోకైకవీరుడు సకలా ధారుడు భవబంధదూరుడు వాడే శూరుడు ధర్మవిచారుడు రఘువంశ సారుడు బ్రహ్మసాకారుడు వాడే
బలుడు యిన్నిటా రవికులుడు భావించ, ని ర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన తలకొనె పుణ్యపాదతలుడు వాడే
7.
కొలనిలోనమునుగోపికలు మొలకనవ్వులతో మ్రొక్కిరి నీకు
పిరుదులు దాటిన పింఛపు టలకల తురుములు వీడగ తొయ్యెలులు అరిది నితంబులందునెదాచుక మురిపెపు కరముల మ్రొక్కిరినీకు
నిద్దపు మానము నెలతలు లోగుచు గద్దరి తొడలనె గట్టుచును ముద్దుటుంగరంబుల కరములతో ముద్దులు గునియుచు మ్రొక్కిరి నీకు
పాలిండ్ల పెనుభారంబుల మూలపు మెరుగులు ముంచగను వేలపు ప్రియముల వేంకటేశనిను మూలకుపిలుచుచు మ్రొక్కిరి నీకు
8.
పసిడియక్షంతలివె పట్టరో వేగమె రారో దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని
శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లిముహూర్తము నేడు కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె దేవతలు రారో దేవుని పెండ్లికిని
కందర్ప జనకునకి కమలాదేవికి పెండ్లి పందిలిలోపల తలంబాలు నేడు గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి అందుక మునులు రారో హరి పెండ్లికిని
అదె శ్రీ వేంకటపతికి అలమేలు మంగకును మొదలి తిరుణాళ్ళకు మ్రొక్కేము నేడు యెదుట నేగేరు వీరెయిచ్చేరు వరములివె కదలిరారో పరుష ఘనుల పెండ్లికిని
9.
చాలుచాలును భోగసమయమున మైమఱపు పాలుపడునట యేటి బ్రతుకురా ఓరీ
ఇందుముఖినిను కౌగిలించి లోపలి జగము కందునని నీ బిగువు కౌగిలే వదలె పొందైన వారితో పొసగ కౌగిట జేర్ప పొందుగాదట యేటి పొందురా ఓరీ
నెలత నీ వాలు కన్నులు మూసి జగమెల్ల కలయ చీకట్లైన గక్కనను వదలె వలచిన అంగనలు తమ వలసిన విలాసముల వలను నెఱపనిదేటి వలపురా ఓరీ
కొమ్మ నీ ఉరముపై గోరు దివియుచునాత్మ నిమ్మైన ననుతాక నిద్దరిని తాకె దిమ్మరివి కోనేటి తిమ్మ నీపై ప్రియము కుమ్మరించని దేటి కోర్కిరా ఓరీ
10.
అదె చూడరే మోహన రూపం పది కోట్లుగల భావజ రూపం
వెలయగ పదారువేల మగువలను అలమిన ఘన మోహన రూపం వలచిన నంద వ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగు రూపం
ఇందిరా వనిత నెప్పుడు తన ఉర మందు నిలిపిన మోహన రూపం కందువ భూసతి కౌగిటి సొంపుల విందులు మరగిన వేడుక రూపం
త్రిపురసతుల బోధించి రమించిన అపురూపపు మోహన రూపం కపురుల శ్రీ వేంకటపతి యైయిల ఉపమించగ రాని ఉన్నత రూపం
11.
మరలి మరలి జయమంగళము సొరిదినిచ్చలును శుభమంగళము
కమలారమణికి కమలాక్షునకును మమతల జయజయ మంగళము అమరజననికిని అమరవంద్యునకు సుముహూర్తముతో శుభమంగళము
జలధికన్యకును జలధిశాయికిని మలయుచును శుభమంగళము కలిమికాంత కాకలికి విభునికిని సుళువుల యారతి శుభమంగళము
చిత్తజు తల్లికి శ్రీ వేంకటపతికి మత్తిల్లిన జయ మంగళము యిత్తల నత్తల యిరువురకౌగిటి జొత్తుల రతులకు శుభమంగళము
12.
విన్నపాలు వినవలె వింత వింతలు పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు అల్లనల్ల నంతనింత నదిగోవారే చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా
గరుడ కిన్నరయక్ష కామినులు గములై విరహపు గీతముల వింతాలాపాల పరిపరివిధముల బాడేరునిన్నదివో సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా
పొంకపు శేషాదులు తుంబురునారదాదులు పంకజభవాదులు నీ పాదాలు చేరి అంకెలనున్నారు లేచి అలమేలుమంగను వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
13.
అలరులు గురియగ నాడెనదే అలకల గులుకుల నలమేలుమంగ
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ అర తెర మరుగున నాడె నదే వరుసగ పూర్వదు వాళపు తిరుపుల హరి గరగింపుచు నలమేలుమంగ
మట్టపు మలపుల మట్టెలకెలపుల తట్టెడి నడపుల దాటెనదే పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ
చిందుల పాటల శిరిపొలయాటల అందెల మ్రోతల నాడె నదే కందువ తిరువెంకటపతి మెచ్చగ అందపు తిరుపుల నలమేలుమంగ
14.
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు జూపులకు చాంగుభళా పలుకుల సొంపుల బతితో గసరెడి చలముల యలుకకు చాంగుభళా
కిన్నెరతో పతి కెలన నిలుచు తన చన్ను మెఱుగులకు చాంగుభళా ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభళా
జందెపు ముత్యపు సరులహారముల చందన గంధికి చాంగుభళా విందయి వెంకట విభుబెన చినతన సంది దండలకు చాంగుభళా
15.
జవ్వాది మెత్తినది అది తన జవ్వనమే జన్నె వట్టినది
ముద్దుల మాటలది అది చెక్కు టద్దముల కాంతి నలరినది గద్దరి చూపులది అది తన వొద్ది చెలియమీద నొరగున్నది
పుత్తడి బోలినది అది తన చిత్తము ని సొమ్ము చేసినది గుత్తపు గుబ్బలది అది అల చిత్తజుని లెక్క సేయనిది
ఎమ్మెలు యెఱుగనిది అది తన కెమ్మోవి జిరునవ్వు గెరలున్నది కమ్ముకొనగ వెంకటరాయా నీ కమ్మని కౌగిట గలశున్నది
16.
చేరి యశోదకు శిశువితడు ధారుణి బ్రహ్మకు దండ్రియు నితడు
సొలసి చూచినను సూర్య చంద్రులను లలి వెద చల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నఖిల దేవతల కలిగించు సురల గనివో యితడు
మాటలాడినను మరి యజాండములు కోటులు వొడమెటి గుణరాశి నీటగు నూర్పుల నిఖిల వేదములు చాటువ నూరెటి సముద్ర మితడు
ముంగిట మొలసిన మోహన మాత్మల బొంగించే ఘన పురుషుడు సంగతి మావంటి శరణాగతులకు సంగము శ్రీ వేంకటాధిపు డితడు
17.
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంత నింత గొల్లెతల అరచేతి మాణికము పంత మాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు
రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ము గాచేటి కమలాక్షుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీ వేంకటాద్రి యింద్రనీలము పాల జలనిధి లోన బాయని దివ్య రత్నము బాలునివలె దిరిగీ బద్మ నాభుడు
18.
నానాటి బదుకు నాటకము కానక కన్నది కైవల్యము
పుట్టుటయు నిజము పోవుటయు నిజము నట్టనడిమి పని నాటకము యెట్ట నెదుట గల దీ ప్రపంచము కట్ట గడపటిది కైవల్యము
కుడిచే దన్నము కోక చుట్టెడిది నడ మంత్రపు పని నాటకము వొడి గట్టుకొనిన వుభయ కర్మములు గడి దాటినపుడె కైవల్యము
తెగదు పాపము తీరదు పుణ్యము నగి నగి కాలము నాటకము యెగువనె శ్రీ వేంకటేశ్వరుడేలిక గగనము మీదిది కైవల్యము
19.
నారాయణతే నమో నమో నారద సన్నుత నమో నమో
మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమపురుష భవబంధ విమోచన నరమృగశరీర నమో నమో
జలధిశయన రవి చంద్రవిలోచన జలరుహ భవనుత చరణయుగ బలిబంధన గోపవధూవల్లభ నలినోదర తే నమో నమో
ఆదిదేవ సకలాగమ పూజిత యాదవకుల మోహన రూప వేదోద్ధర శ్రీ వేంకటనాయక నాదప్రియ తే నమో నమో
20.
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి
కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి ఘనమైన దీపసంఘములు గంటి అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి
అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి సరిలేని యభయ హస్తము గంటి తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి
21.
పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా మమ్ము నెడయకవయ్య కోనేటి రాయడా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా, చాల నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా, మాకు చేరువజిత్తములోని శ్రీనివాసుడా
భావింప గైవసమైన పారిజాతమా, మమ్ము చేవదేర గాచినట్టి చింతామణీ కావించి కోరికలిచ్చే కామధేనువా, మమ్ము తావై రక్షించేటి ధరణీధరా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా, రోగా లడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడియించినట్టి శ్రీ వేంకటనాథుడా
22.
అరసి నీకు శరణనియెద నేను
యెదుట నెవ్వరిక నే మాటాడిన
అది నీ ఘన నామాంకితమే
అదివో సకల శబ్దాఖ్యుడవని నిన్ను
పొదలి చదువులు పొగడీగాన
యెవ్వరి పొగడాని యెక్కడ నుండిన
నివ్వటిల్లనది నీ రూపే
నెవ్వదీర నిదె నిను విశ్వరూపుడు
యెవ్వల నని శ్రుతులెంచీగాన
భావన యిది నీ బ్రహ్మాత్మకమే
శ్రీవేంకటేశ నాచింతయిదే
ఆవల నిను సర్వాంతర్యామెని
దేవ శాస్త్రములు తెలిపీగాన
23.
నానారూపధరుడు నారాయణుడు వీడే
పూనినవుపములెల్లా బొసగెనితనికి
గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని
సొరిది సముద్రము చొచ్చినయట్లు
పురుషసూక్తమున విప్రులు సేసేమజ్జనము
అరుదుగ పన్నీరెల్లా నమరే నీ హరికి
అట్టే వెల్లమొయిళ్ళు ఆకసాన నిండినట్టు
గట్టిగా మేన నిండెను కప్పురకాపు
వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు
తట్టుపుణుగమరెను దైవాలరాయనికి
నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు
తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు
అలమేలుమంగ వురమున నెలకొనెనిదె
చెలరేగి శృంగారాల శ్రీవేంకుటేశునికి
పూనినవుపములెల్లా బొసగెనితనికి
గరిమ నేరులు వానకాలమునఁ బెనగొని
సొరిది సముద్రము చొచ్చినయట్లు
పురుషసూక్తమున విప్రులు సేసేమజ్జనము
అరుదుగ పన్నీరెల్లా నమరే నీ హరికి
అట్టే వెల్లమొయిళ్ళు ఆకసాన నిండినట్టు
గట్టిగా మేన నిండెను కప్పురకాపు
వొట్టి తన విష్ణుమాయ వొడలిపై వాలినట్టు
తట్టుపుణుగమరెను దైవాలరాయనికి
నిలువున సంపదలు నిలిచి రూపైనట్టు
తెలివి సొమ్ములపెట్టె దెరచినట్టు
అలమేలుమంగ వురమున నెలకొనెనిదె
చెలరేగి శృంగారాల శ్రీవేంకుటేశునికి
24.
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మ తోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని
పచ్చ కప్పురమె నూఱి పసిడి గిన్నల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరుపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చె మల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని
తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని
సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి
కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మ తోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని
పచ్చ కప్పురమె నూఱి పసిడి గిన్నల నించి
తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరుపడి చూడ అందరి కన్నులకింపై
నిచ్చె మల్లెపూవు వలె నిటుతానుండే స్వామిని
తట్టు పునుగే కూరిచి చట్టలు చేరిచినిప్పు
పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేను నిండ పట్టించి దిద్ది
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని
25.
బ్రహ్మ కడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము
బ్రహ్మము తానె నీ పాదము
చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము
బలరిపు గాచిన పాదము
కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము
పామిడి తురగపు పాదము
పరమయోగులకు పరిపరివిధముల
పరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన
పరమపదము నీ పాదము
26.
విన్నపాలు వినవలె - వింత వింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా.
1. తెల్లవారె జామెక్కె - దేవతలు మునులు
అల్లనల్లనంత నింత నదిగో వారే
చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు
మెల్ల మెల్లనె విచ్చి మేలుకొన వేలయ్యా
2. గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరు నెన్నదివో
సిరి మొగము దెరచి చిత్తగించ వేలయ్యా
3. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా.
1. తెల్లవారె జామెక్కె - దేవతలు మునులు
అల్లనల్లనంత నింత నదిగో వారే
చల్లని తమ్మిరేకుల సారసపు గన్నులు
మెల్ల మెల్లనె విచ్చి మేలుకొన వేలయ్యా
2. గరుడ కిన్నర యక్ష కామినులు గములై
విరహపు గీతముల వింతాలాపాల
పరిపరివిధముల బాడేరు నెన్నదివో
సిరి మొగము దెరచి చిత్తగించ వేలయ్యా
3. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు
పంకజభవాదులు నీ పాదాలు చేరి
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా
27.
సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెద రోలాల
1. వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోరాలాల
కనుచూపులనిడు రోకండ్లను కన్నెలు దంచెద రోలాల
2. బంగరు చెఱగుల పట్టు పుట్టములు కొంగులు దూలగ నోలాల
అంగనలందరు నతివేడుకతో సంగడి దంచెద రోలాల
3. కురులు దూలగ మచి గుబ్బచనులపై సరులు దూలాడగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెద రోఅలాల
4. ఘల్లు ఘల్లుమను కంకణరవముల పల్లవపాణుల నోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు లొల్లనె దంచెద రోలాల
5. కప్పురగంధులు కమ్మనిపువ్వుల చప్పరములలో నోలాల
తెప్పలుగా రతి దేలుచు గోనే టప్పనిబాడెద రోలాల
1. వనితలు మనసులు కుందెన చేసిటు వలపులు తగనించోరాలాల
కనుచూపులనిడు రోకండ్లను కన్నెలు దంచెద రోలాల
2. బంగరు చెఱగుల పట్టు పుట్టములు కొంగులు దూలగ నోలాల
అంగనలందరు నతివేడుకతో సంగడి దంచెద రోలాల
3. కురులు దూలగ మచి గుబ్బచనులపై సరులు దూలాడగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు గురియుచు దంచెద రోఅలాల
4. ఘల్లు ఘల్లుమను కంకణరవముల పల్లవపాణుల నోలాల
అల్లన నడుములు అసియాడుచు సతు లొల్లనె దంచెద రోలాల
5. కప్పురగంధులు కమ్మనిపువ్వుల చప్పరములలో నోలాల
తెప్పలుగా రతి దేలుచు గోనే టప్పనిబాడెద రోలాల
28.
ఏమొకో చిగురుటధరమున యెడనెడ గస్తురి నిండెను
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
1.కలికి చకోరాక్షికి గడకన్నులు కెంపై తోచిన
చెలువం బిప్పుడిదేమో - చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై - నాటిన యా కొనచూపులు
నిలువున బెరుకఘ నంటిన - నెత్తురు కాదు గదా
2. పడతికి చనుగవ మెఱుగులు - పై పై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో బ్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవి కాలపు - వెన్నెల కాదు గదా
3. ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేవో - వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి - కామినివదనాంబుజమున
అద్దిన సురతపుజెమటల - అందము కాదు గదా
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
1.కలికి చకోరాక్షికి గడకన్నులు కెంపై తోచిన
చెలువం బిప్పుడిదేమో - చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై - నాటిన యా కొనచూపులు
నిలువున బెరుకఘ నంటిన - నెత్తురు కాదు గదా
2. పడతికి చనుగవ మెఱుగులు - పై పై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో బ్రియుడొత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవి కాలపు - వెన్నెల కాదు గదా
3. ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పుల
వొద్దికలాగులివేవో - వూహింపరె చెలులు
గద్దరి తిరువేంకటపతి - కామినివదనాంబుజమున
అద్దిన సురతపుజెమటల - అందము కాదు గదా
29.
జగడపు చనువుల జాజర, సగినల మంచపు జాజర
మొల్లలు తురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై, చల్లే రతివలు జాజర
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపేటి గంధవొడి
చేరువ పతిపై చిందగ పడతులు, సారెకు చల్లేరు జాజర
బింకపు కూటమి పెనగేటి చెమటల, పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు, సంకుమ దంబుల జాజర
30.
జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి
హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కుండలను నేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీ శాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను
మాపుగానే వచ్చి మా మానములను
నీపాపడే చెఱిచె నేమందుమమ్మ
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి
జగడములు కలిపించి సతిపతులబట్టి
పగలు నలుజాములును బాలుడై నట్టి
మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో పాలు పోసేరా
దొంగ నీవని సతులు గొంకుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార
గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి
కావరమ్మున నున్న కంసుపడగొట్టి
నీవు మధురాపురము నేలచేపట్టి
ఠీవితో నేలిన దేవకీపట్టి
అలిగి తృణావర్తు నవని గూల్చితివి
బలిమిమై బూతన బట్టి పీల్చితివి
చెలగి శకటాసురుని జేరి డొల్చితివి
తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి
హంగుగా తాళ్ళపా కన్నయ్య చాల
శృంగార రచనగా చెప్పెనీ జోల
సంగతిగ సకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదనగోపాల
ref:


