బమ్మెర పోతన భాగవతము పద్యాలు(Bammera Pothana)
బమ్మెర పోతన ప్రసిద్ధ తెలుగు కవి. సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. పోతన కవిత్వం మాధుర్యానికి పెట్టింది పేరు. భాగవతంలో ఎన్నో పద్యాలు తెలుగునాట ప్రతినోటా నానాయి. పోతన ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి.
భాగవతం ఆరంభంలో వ్రాసిన ప్రార్ధనా పద్యం:
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక
భాగవతం ఆరంభంలో వ్రాసిన ప్రార్ధనా పద్యం:
శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ లోక
రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళి లోల విలసదృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహా నందాంగనా డింభకున్ !!
ఆయన సంకల్పాన్ని, వినయాన్ని, భక్తిని చాటే పద్యములు...
పలికెడిది భాగవతమట
పలికెంచెడువాడు రామ భద్రుండట
నే పలికిన భవహరమగునట
నే పలికిన భవహరమగునట
పలికెద వేరొండు గాధ పలుకగనేలా
బృందావనములో గోపాలుని వెదుకుచున్న గోపకాంతల తాపత్రయము...
నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పై
జల్లెడువాడు, మౌళిపరిసర్పిత పింఛమువాడు, నవ్వురా
జిల్లెడుమోమువా డొకడు ెల్వల మానధనంబు దెచ్చె నో
మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ, చెప్పరే?
మొసలిబారి చిక్కిన గజేంద్రుడు ఆపన్నశరణుని వేడుకొన్న విధము..
ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం
బెవ్వ; డనాదిమధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్చ వచ్చె; దనువున్ డప్పెన్; శ్రమబయ్యెడిన్;
నీవె తప్ప నిత:పరం బెఱుగ; మన్నింపందగున్ దీనునిన్;
రావె ఈశ్వర; కావవె వరద; సంరక్షింపు భద్రాత్మకా;
అల వైకుంఠ పురంబులో నగరిలో నామూల సౌధంబు
దాపల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
దాపల మందార వనాంతరామృతసరః ప్రాంతేందుకాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు
వివిహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై
వివిహ్వల నాగేంద్రము 'పాహి పాహి' యనఁగుయ్యాలించి సంరంభియై
మన్ను తిన్నావా? కన్నా? అని తల్లి యశోద గద్దించినది. లేదమ్మా అని బాలకృష్ణుడు నోరు తెరచి చూపెను. ఆ లీలామానుషుని నోట యశోదమ్మ సకల భువనములను చూచి అబ్బురపడినది...........
కలయో!వైష్ణవమాయయో! ఇతర సంకల్పార్ధమోసత్యమో
తలపన్ నేరక యున్నదాననొ: యశోదాదేవి గానో! పర
స్థలమో! బాలకుడెంతయీతనిముఖస్తంబైయజాండంబు ప్ర
జ్వలమైన్ యుండుట కేమిహేతువో! మహాశ్చర్యంబు చింతింపగన్
నీ హరి యెక్కడున్నాడని గద్దించిన హిరణ్య కశిపునకు భక్తప్రహ్లాదుదిచ్చిన సమాధానము......
ఇందు గలడందు లేడను
సందేహంబు వలదు చక్రి సర్వోపగతున్
డెందెందు వెదెకి చూసిన
అందందే కలడు దానవాగ్రణి కంటే!
వామనావతారం ఘట్టంలో వామనుడు త్రివిక్రముడై పెరిగిన విధాన్ని వర్ణించే ఈ రెండు పద్యాలూ చాలా ప్రసిద్ధి చెందినవి. "ఇంతింతై వటుడింతయై " అన్న పదాలను ఒక నుడికారంగా పలు సందర్భాలలో వాడుతారు. వామనుడు పెరిగిన కొద్దీ సూర్య బింబం స్థాయి ఎలా ఉందో రెండో పద్యంలో వివరంచాడు. ముందు గొడుగుగా ఉంది. తరువాత తలపైరత్నం. తరువాత మెడలో ఆభరణం. ఇలా చివరకు పాదపీఠం అయ్యంది.
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరో రత్నమై
శ్రవణాలంకృతి యై గళా భరణామై సౌవర్ణ కేయూర మై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచత్ ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠ మై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్ !!
పోతన ముగురమ్మలనూ స్తుతించిన పద్యాలు చాలా మందికి నిత్య ప్రార్ధనా గీతాలు.
సరస్వతీ ప్రార్ధన: ఇందులో తెల్లనివైన 16 వస్తువులను సరస్వతి రంగుతో పోల్చాడు.
శారద నీరదేందు ఘన సార పటీర మరాళ
మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ
కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ
సుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ !!
లక్ష్మీదేవి ప్రార్ధన:
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్
అమ్మల గన్నయమ్మ పార్వతీ దేవి ప్రార్ధన:
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల
పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ
మా యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
అంబ నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీప్తికా
చుంబిత దిగ్విభాగ శ్రుతిసూక్త వివిక్త నిజ ప్రభావ భా
వాంబర వీధి విశ్రుత విహారి ననుం గృపఁచూడు భారతీ!
ref:


